logo
సినిమా

శ్రీరెడ్డికి రాంగోపాల్ వర్మ రూ.5 కోట్ల ఆఫర్ ఎందుకు ఇచ్చారు..?

X
Highlights

HMTV దగ్గరున్న శ్రీరెడ్డి ఆడియో టేప్ గురించి డైరెక్టర్ వర్మ ఏమంటున్నారు...? అసలు పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్...

HMTV దగ్గరున్న శ్రీరెడ్డి ఆడియో టేప్ గురించి డైరెక్టర్ వర్మ ఏమంటున్నారు...? అసలు పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్ చేయమని శ్రీరెడ్డికి వర్మ ఎందుకు సలహా ఇచ్చారు..? ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కుటుంబంతో శ్రీరెడ్డికి ఉన్న వివాదంలో డీల్ సెటిల్ చేయడానికి ఆర్జీవీ ప్రయత్నించాడా..? రాంగోపాల్ వర్మ వెర్షన్ ఏంటి..?

తమన్నా సింహాద్రితో శ్రీరెడ్డి మాట్లాడిన ఫోన్ సంభాషణ HMTVలో ప్లేఅయిన కొద్దిసేపటికే రాంగోపాల్ వర్మ తన తప్పును అంగీకరించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను శ్రీరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించడం వెనక ఉన్నది తానేనని ఆర్జీవి ఒప్పుకున్నారు. శ్రీరెడ్డి చేస్తున్న ఉద్యమం పెద్ద ఎత్తున అందరిలోకి వెళ్లడానికే అలా అనమని చెప్పానన్నారు. ఈ మేరకు ఓ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు.

అంతేకాదు నిర్మాత దగ్గుబాటి సురేశ్ కుటుంబంతో శ్రీరెడ్డికి ఉన్న వివాదాన్ని పరిష్కరించేందుకు తాను ముందుకు వచ్చానని చెప్పారు...ఆర్జీవి. సురేశ్ కుటుంబం నుంచి ఐదు కోట్లు వచ్చేలా చేస్తానని శ్రీరెడ్డికి ఫోన్లో చెప్పానన్నారు. ఆ సెటిల్‌మెంట్‌కు ఆమె అంగీకరించలేదన్న వర్మ..ఎన్నో కుటుంబాలకు లాభం చేకూర్చే పోరాటాన్ని డబ్బు తీసుకుని తప్పుదోవ పట్టించలేనని చెప్పిందని తెలిపారు. శ్రీరెడ్డి పవన్ వివాదంలో తానే ఉన్నానని వర్మ అంగీకరించడం కలకలం రేపుతోంది. అయితే శ్రీరెడ్డిని ప్రభావితం చేసినందుకు పవన్‌ కల్యాణ్‌కు, ఆయన అభిమానులకు వర్మ క్షమాపణలు చెప్పారు.

Next Story