జీఎస్టీ వ‌ల్ల ఆర్జీవికి వ‌చ్చిన లాభ‌మెంతో తెలుసా?

జీఎస్టీ వ‌ల్ల ఆర్జీవికి వ‌చ్చిన లాభ‌మెంతో తెలుసా?
x
Highlights

ఎన్నో నిరసనల మధ్య రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లఘు చిత్రం 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తిగా మియా మ‌ల్కోవా న్యూడిటీపై...

ఎన్నో నిరసనల మధ్య రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లఘు చిత్రం 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తిగా మియా మ‌ల్కోవా న్యూడిటీపై ఆధార‌ప‌డి తీసిన 19 నిమిషాల నిడివి గల ఈ చిత్రం విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. దీంతో, నెట్లో ఇది విడుదల కాగానే, చూడ్డానికి జనాలు ఎగబడ్డారు. లక్షల మంది ఒక్కసారిగా సైట్లోకి ఎంటర్ కావడంతో... అది క్రాష్ అయింది కూడా.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ వీడియోను స్నేహితుల‌తో క‌లిసి వ‌ర్మే రూపొందించాడ‌ని తెలుస్తోంది. ఈ వీడియో నిర్మాణానికి దాదాపు 70 ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చైంద‌ట‌. అందులో సింహ‌భాగం మియా మ‌ల్కోవాకే వెళ్లింద‌ట‌. ఇంకొంత రీ-రికార్డింగ్ చేసిన కీర‌వాణికి చెల్లించార‌ట‌. ఇప్ప‌టివర‌కు ఈ వీడియో వ‌ల్ల నిర్మాత‌ల‌కు ప‌ద‌కొండు కోట్ల‌కు పైగా ఆదాయం వ‌చ్చింద‌ట‌. అంటే రూ.70 ల‌క్ష‌లు ఖ‌ర్చుపెడితే 11 కోట్ల రూపాయ‌ల ఆదాయం. అందుకే వెంట‌నే జీఎస్టీ-2ను ఆర్జీవీ ప్ర‌క‌టించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories