రంగస్థలం ఫస్ట్ రివ్యూ..నెగెటివ్ సెంటిమెంట్ లో మెగా అభిమానులు

రంగస్థలం ఫస్ట్ రివ్యూ..నెగెటివ్ సెంటిమెంట్ లో మెగా అభిమానులు
x
Highlights

రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. నేడు ఈ మూవీ విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దాదాపు రూ.80 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్...

రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. నేడు ఈ మూవీ విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దాదాపు రూ.80 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. పల్లెటూరి వాతావరణంలో, చెర్రీ గత సినిమాలకు భిన్నంగా వస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. దేవీ శ్రీ సంగీతం అందించిన మ్యూజిక్ ఆల్బమ్, ట్రైలర్‌లోని సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. సినిమా బాగుందనేది సెన్సార్ టాక్. కాగా సినిమాలకు ముందుగానే రివ్యూలు ఇచ్చే ఉమర్ సంధూ ‘రంగస్థలం’కు కూడా ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు. మూవీకి 3.5 రేటింగ్ ఇచ్చి ఈమూవీ పై ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు ఈమూవీ పైసా వసూల్ మసాలా సినిమాగా అభివర్ణించాడు రామ్ చరణ్, సమంత, జగపతి బాబు వీరు ముగ్గురు అద్భుతంగా నటించారంటూ ఆకాశానికి ఎత్తేశాడు.

అయితే ఇక్కడే మెగా అభిమానులకు భయం పట్టుకుంది. గతంలో ఉమర్ సంధూ టాప్ రేటింగ్ ఇచ్చిన ‘బ్రహ్మోత్సవం’ ‘కాటమరాయుడు’, ‘స్పైడర్’, ‘అజ్ఞాతవాసి’ సినిమాలకు విడుదలకు ముందే ఆసినిమాలను చూసి ఉమర్ సంధూ టాప్ రేటింగ్స్ ఇచ్చాడు. ఈసినిమాలన్నీ ఘోరమైన ఫ్లాప్ లుగా మారి ఆ సినిమా హీరోల అభిమానులకు కూడ అసహనాన్ని కలిగించాయి. దీనితో ఈ క్రిటిక్ ఇచ్చే రివ్యూలకు ఆదరణ తగ్గడమే కాకుండా ఈ రివ్యూల పై నమ్మకం కూడ తగ్గింది. అయితే ఈ విమర్శకుడు మంచి రేటింగ్స్ ఇచ్చిన భారీ సినిమాలు అన్నీ ఫ్లాప్ అయిన నేపధ్యంలో అదే సెంటిమెంట్ ‘రంగస్థలం’ ను వెంటాడు తుందా అన్న భయాలు మెగా అభిమానులకు ఈసినిమాను కొన్న బయ్యర్లకు వెంటాడుతున్నట్లు టాక్.

Show Full Article
Print Article
Next Story
More Stories