logo
సినిమా

విమానంలోని టాయిలెట్‌లో రాఖీ సావంత్ హంగామా!

X
Highlights

కాంట్రవర్సీ క్వీన్ రాఖీ సావంత్ ఏం చేసిన సంచలనమే. మాటలు, చేతలు అన్నీ వివాదాస్పదమే. తాజాగా విమానం టాయిలెట్లో ఆమె ...

కాంట్రవర్సీ క్వీన్ రాఖీ సావంత్ ఏం చేసిన సంచలనమే. మాటలు, చేతలు అన్నీ వివాదాస్పదమే. తాజాగా విమానం టాయిలెట్లో ఆమె చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె విమానంలోని బాత్రూమ్‌లో డాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. ఫ్లైట్‌లో ఉన్న రాఖీ‌సావంత్ ఎయిర్ హోస్టెస్‌ను డాన్స్ చేసేందుకు పర్మిషన్ అడిగారు. అయితే దీనికి వారు అనుమతివ్వలేదు. దీంతో ఆమె తన సీటులో నుంచి లేచి నేరుగా విమానంలోని టాయిలెట్ దగ్గరకు వెళ్లారు. అక్కడ డాన్స్ చేసి, ఆ వీడియోను తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేశారు. వైరల్‌గా మారిన ఈ వీడియోను గమనిస్తే... రాఖీ ఆ విమానంలో తన స్నేహితులతో పాటు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి టాయిలెట్ దగ్గర డాన్స్ చేసి, దానిని ఆమె కికి ఛాలెంజ్‌గా పేర్కొంది.

Next Story