logo
సినిమా

కోలుకోలేని దెబ్బ కొడుతున్న రజినీకాంత్

కోలుకోలేని దెబ్బ కొడుతున్న రజినీకాంత్
X
Highlights

సూపర్ స్టార్ రజినీ కాంత్ ఇప్పుడు సౌత్ లో ఎవరూ కోలుకోలేని దెబ్బ కొడుతున్నాడు. ఎవరూ ఊహించని షాక్ ఇస్తున్నాడు....

సూపర్ స్టార్ రజినీ కాంత్ ఇప్పుడు సౌత్ లో ఎవరూ కోలుకోలేని దెబ్బ కొడుతున్నాడు. ఎవరూ ఊహించని షాక్ ఇస్తున్నాడు. పాలిటిక్స్ లోకి ఎంటరవ్వటం పెద్ద సర్ ప్రైజ్ కాకపోయినా, అంతకు మించే సర్ ప్రైజ్ తో అభిమానుల్ని ఆందోళనలోకి నెట్టాడు. ఇక సెలవుని ప్రకటిస్తున్నాడు. సూపర్ స్టార్ రజినీ కాంత్, నడిస్తే స్టైలే, నడవకుండా నిలుచున్నా స్టైలే విజిలేసినా స్టైలే, సిగరెట్ కాల్చినా స్టైలే, ఆఖరికి గుండు తో కనపించినా, స్టైలే అసలు రజినీ అంటేనే స్టైల్ కాని ఇప్పుడు అవన్నీ మిస్సయ్యే పరిస్థితొచ్చింది

దేవుడు శాశించాడు రజినీ కాంత్ పాలిటిక్స్ లోకి ఎంటరయ్యాడు అంతవరకు బానే ఉంది కానీ సినిమాలకు గుడ్ బై చెప్పే టైం వచ్చిందంటున్నాడు అదే జరిగితే, ఇక గన్ తో సిగరెట్ ని కాల్చే సీన్లు, కండువాతో, ఉయ్యా మంచాన్ని కిందకి లాగే సీన్లు ఇలా ఔరా అనిపించే సీన్లు ఇక చూడలేం..బాబా బాల్ ని ఎగరేసి కొడితే, ఒకే దెబ్బకి పదిమంది ప్లేయలర్లు పడిపోతారు అలాంటి సీన్లు ఇక మనం మిస్ అవుతామా? ఐతే సూపర్ మ్యాన్ మూవీల్లోనో, హల్క్ సినిమాల్లోనో కనిపంచే అలాంటి విన్యాసాలు, మరెక్కడైన కనిపిస్తాయంటే అది రజినీ కాంత్ మూవీనే కాస్త నవ్వొచ్చినా, రజినీగురించి తెలిసిన వాళ్లు అలాంటి సీన్లను కూడా యాక్సెప్ట్ చేస్తారు ఐతే, ఇప్పుడు రజినీ సినమాలకు గుడ్ బై చెబితే, ఇక తన సూపర్ స్టంట్ల ను చూసే అవకాశమే ఉండదు

రజినీ కాంత్ బాబా మూవీ వచ్చినప్పుడు ఓ ఐటీ కంపెనీ, తన ఉద్యోగులకు వన్ డే హాలీడేన ఇచ్చి, ఓ థియేటర్ నే బుక్ చేసింది. శివాజి మూవీ అప్పుడు అదే జరిగింది, ఆ మధ్య వచ్చిన లింగా, కాలా, ఇలా సూపర్ స్టార్ మూవీ వస్తే, చాలు, కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు హాలీడే ఇచ్చే పరిస్థితొచ్చింది ఇక మీదట అలాంటి పరిస్థితులుండవ్..రజినీ ఎలా కనిపించినా, ఏం చేసినా యాజ్ ఇట్ ఈజ్ అదే ఫాలో అయ్యేంత విచిత్రమైన ఫ్యాన్స్, కేవలం రజినీ సొంతం అందుకే తను వసూళ్ల సునామీ తెచ్చే బంగారు బాతంటారు కబాలి మూవీ ఓమాదిరి అని టాక్ వచ్చినా కాని, ఆ సినిమాకు ప్రపంచ వ్యప్తంగా 550 కోట్ల పైనే వసూల్లొచ్చాయంటే, తన స్టామినా ఎంటో అర్ధం చేసుకోవచ్చు

టాలీవుడ్ ,కోలీవడు్ లోనే కాదు జపాన్, మలేషియా, సింగపూర్ అంతటా రజినీ కాంత్ అభిమానులే అప్పట్లో ముత్తు జపాన్లో హండ్రెడ్ డేస్ ఆడటమే తన రేంజ్ కి, ఇమేజ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ అంత సీన్ ఉన్న రజినీ సినిమాలకు గుడ్ బై చెబతే ఫ్యాన్స్ పరిస్థితేంటి?

రజినీ కాంత్ మూవీ రోబో 2.0 ఏప్రిల్ 14 న రిలీజ్ కాబోతోంది. ఆతర్వాత పా రంజీత్ మేకింగ్ లో రజినీ చేస్తున్న కాలా సినిమా రిలీజ్ అవుతుంది ఆ తర్వాతే మళ్లీ పా రంజిత్ మూవీ మేకింగ్ లోనే ఓ పొలిటికల్ డ్రామా తీసి, సినిమాలకు గుడ్ బై చెప్పపోతున్నాడు రజినీ కాంత్. 70 ఏళ్ల వయసులో పార్టీ పెట్టి, రాజకీయాల్లోకి రావలనుకున్న రిజనీ, ఇక సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు. కాలా మూవీ తర్వాత మల్లీ పా రంజీత్ మేకింగ్ లోనే ఓ పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామా ప్లాన్ చేశాడు. అది ఈఏడాది పట్టాలెక్కబోతోంది. తన ఐడియాలజిని రిఫ్లెక్ట్ చేసే ఆ సినిమాకు స్క్రిప్ట్ రాసే పనిలో పారంజిత్ బిజీ అయ్యాడు కాలా మూవీతీస్తూనే మరో మూవీకి కథ సిద్ధం చేస్తున్నాడు.

కాలా తర్వాత తెరకెక్కబోయే పొలిటికల్ డ్రామా సూపర్ స్టార్ రజినీ ఆఖరి చిత్రంగా రాబోతోంది. ఆతర్వాత ఇక రజినీని వెండితెరమీద చూసే పరిస్థితి ఉండదు మరి పూర్తిగా సినమాలనుంచి తప్పుకోబోయే ముందు రిజనీ చేసే సినిమా అంటే ఎలా ఉంటుంది. రజినీ చివరి ప్రయత్నం ఎలా షాక్ ఇస్తుంది..ఇలాంటి ప్రిడిక్షన్స్ వినిపిస్తున్నా, రజినీ కెరీర్ కి శుభం కార్డ్ పడబోతోందంటే, అది తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బే, అభిమానులకు కూడా కోలుకోలేని దెబ్బే.

Next Story