రాజస్థాన్ లో కాంగ్రెస్ హవా?..మరి గెలిస్తే సీఎం ఎవరో..?

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు అధికార బిజెపికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ...
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు అధికార బిజెపికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న వసుంధర రాజేకు తాజాగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు పూర్తిగా నిరాశ పరిచాయి.ఇప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమే అయితే రాజకీయంగా ఆమె కెరీర్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లే 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ టీమ్ వసుంధర టీమ్ ను పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజస్థాన్ లో కాంగ్రెస్ గాలి వీస్తోంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు అదే విషయం తెలియ చేస్తున్నాయి. వసుంధరా రాజే ప్రభుత్వంపై వ్యతిరేకత చాలా తీవ్రస్థాయిలో ఉందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్న మాట. టైమ్స్ నౌ సర్వే ప్రకారం 200 సీట్లున్న రాజస్థాన్ అసెంబ్లీలోఎన్నికలు జరిగినవి 199 స్థానాలు వీటిలో బిజెపికి 85 , కాంగ్రెస్ కు 105, బీఎస్పీకి రెండు, ఇతరులకు రెండు సీట్లు వచ్చే అవకాశముంది.
ఇండియాటుడే టీమ్ రాజస్థాన్ అంతా విస్తృతంగా పర్యటించి 63వేలమంది ఓటర్లను సర్వే చేసింది. ఈ ఎగ్జిట్ పోల్ సర్వే కాంగ్రెస్ కు ఏకంగా 119 నుంచి 141 స్థానాలు వచ్చే ఆస్కారముందంది. బిజెపికి కేవలం 55 నుంచి 72 సీట్లు వస్తాయని, ఇతరులకు 4నుంచి 11 సీట్లు వస్తాయని అంచనా కట్టింది. ఇక ఇండియా టీవీ సర్వే కూడా కాంగ్రెస్ కి 100 నుంచి 110 సీట్లు వస్తాయని లెక్కేసింది. బిజెపికి 80 నుంచి 90 సీట్లు వస్తాయని బీఎస్పీ మూడు స్థానాలు గెలుచుకునే ఆస్కారముందని ఇతరులు ఆరునుంచి 8 సీట్లు గెలుస్తారనీ అంచనా వేస్తోంది.
ఇక రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం బిజెపికి76 సీట్లు, కాంగ్రెస్ కి115, ఇతరులకు 8 సీట్లు వస్తాయని తేలింది. ఇక ఏబీపీ ఛానెల్ రాజస్థాన్లో ప్రాంతాల వారీగా సర్వే చేసి ఫలితాలు వెల్లడించింది. ఏబీపీ సర్వే ప్రకారం 39 సీట్లున్న ఉత్తర రాజస్థాన్ లో కాంగ్రెస్ ఓట్ షేర్ 39 శాతంగా ఉంటుందని బిజెపి ఓట్ షేర్ 32 శాతం ఇతరుల ఓట్ షేర్29% గా ఉండొచ్చని తేల్చింది. ఇక పశ్చిమ రాజస్థాన్ విషయానికొస్తే బిజెపికి ఓట్ షేర్ 45 శాతం ఉంటుందని కాంగ్రెస్ కు ఇక్కడ 39.5 శాతం ఉండొచ్చని, ఇతరులకు 15 శాతం ఓట్లు వస్తాయనీ తేల్చింది.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT