Top
logo

వరదనీటిలో కొట్టుకుపోయిన అమ్మవారి విగ్రహం

X
Highlights

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉదయం భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో...

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉదయం భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు ఏరులై పారుతోంది. ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చిచేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పంజాగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, బేగంపేట, యూసుఫ్‌గూడ, కృష్ణానగర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి వర్షపు నీరు వచ్చి చేరడంతో కిలోమీటర్ల మేర భారీగా స్తంభించింది. ఒక్కసారిగా కుండపోతగా కురిసిన వర్షానికి కృష్ణానగర్‌ నీటమునిగింది. డ్రైనేజీలు, నాలాలు పొంగిపొర్లుతున్నాయి. వరదనీరు ఉదృతంగా ప్రవహించడంతో నవరాత్రుల్లో భాగంగా మండపంలో కొలువై ఉన్న దుర్గామాత విగ్రహం వరదనీటిలో కొట్టుకుపోయింది.

Next Story