logo
జాతీయం

అప్పటిదాకా మోదీని నిద్రపోనివ్వం: రాహుల్

అప్పటిదాకా మోదీని నిద్రపోనివ్వం: రాహుల్
X
Highlights

భారత ప్రధాని నరేంద్రమోఢీపై మరోసారి రాహుల్ గాంధీ నిప్పులు చేరిగారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా మోఢీని ...

భారత ప్రధాని నరేంద్రమోఢీపై మరోసారి రాహుల్ గాంధీ నిప్పులు చేరిగారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా మోఢీని నిద్రపోనివ్వబోమని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ప్రభుత్వాలను ఏర్పాటైన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాలు కేవలం ఆరు గంటల్లో రైతు రుణాలను మాఫీ చేసినట్టు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మిగిలిన రాజస్థాన్ రాష్ట్రంలోకూడా అతిత్వరలోనే రైతులకు ఊరట కల్పిస్తామని రాహుల్ గాంధీ వెల్లడించారు. నేడు పార్లమెంట్ సమావేశంలో రాహుల్ గాంధీ మోదీపై దూకుడు ప్రదర్శించడం విశేషం. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని రైతుల విజయంగా రాహుల్ గాంధీ అభివర్ణించారు.

Next Story