Top
logo

రాహుల్‌కు మోదీ నినాదాలతో స్వాగతం

Highlights

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్ గాంధీ.. పలు ఆలయాలను సందర్శిస్తున్న విషయం విదితమే. ఆదివారంనాడు యథాప్రకారం ...

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్ గాంధీ.. పలు ఆలయాలను సందర్శిస్తున్న విషయం విదితమే. ఆదివారంనాడు యథాప్రకారం గుజరాత్ రెండో విడత గుజరాత్ ఎన్నికల ప్రచారాన్ని ఆలయ సందర్శనతో శ్రీకారం చుట్టారు. ఖేడ జిల్లాలోని ప్రఖ్యాత రాన్చోడ్జి ఆలయాన్ని ఆయన ఆదివారం సందర్శించారు. అయితే ఈసారి ఆయన ఆలయ సందర్శనలో ఎలాంటి వివాదమూ చోటుచేసుకోలేదు. ఆలయం వెలుపల గుమిగూడిన బీజేపీ కార్యకర్తలు మాత్రం రాహుల్ ఆలయం నుంచి బయటకు వస్తుండగా 'మోదీ మోదీ' అంటూ నినాదాలు చేశారు. రాహుల్ ఏమాత్రం తడబడకుండా తన కారువైపు వెళ్తూ...జనం వైపు చిరునవ్వులు చిందిస్తూ చేతులూపారు.

Next Story