Top
logo

కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితాపై అధినేత రాహుల్ గాంధీ అసంతృప్తి

కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితాపై అధినేత రాహుల్ గాంధీ అసంతృప్తి
X
Highlights

వారాల తరబడి సమీక్షలు, రోజులకు రోజులు చర్చలు సాగించి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ రూపొందించిన జాబితాపై...

వారాల తరబడి సమీక్షలు, రోజులకు రోజులు చర్చలు సాగించి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ రూపొందించిన జాబితాపై అధినేత రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జాబితాను పున: పరిశీలించాలంటూ కేంద్ర ఎన్నికల కమిటీని ఆదేశించారు. తెలంగాణ ఉద్యమానికి మూల కేంద్రంగా నిలిచిన ఓయూ విద్యార్ధులకు టికెట్లు ఎందుకు కేటాయించలేదని రాహుల్ ప్రశ్నించారు. దీంతో కమిటీ సభ్యులు సమాధానం చెప్పలేక సీఈసీ సభ్యులు నీళ్లు నమిలారు. మొత్తం అభ్యర్ధుల జాబితాను వెనక్కు పంపిన రాహుల్ పూర్తి స్ధాయిలో పరిశీలించి కొత్త జాబితాను సిద్ధం చేయాలంటూ ఆదేశించారు.

Next Story