logo
జాతీయం

ఈ వయసులో నాకిలాంటివెందుకు రాహుల్‌?

ఈ వయసులో నాకిలాంటివెందుకు రాహుల్‌?
X
Highlights

ఇన్నాళ్లూ రాహుల్ అంటే అంతా లైట్ తీసుకునేవారు. కానీ ఇప్పుడు రాహుల్ అంటే లైట్ కాదు ఫైట్ అని నిరూపించారు. రాహుల్...

ఇన్నాళ్లూ రాహుల్ అంటే అంతా లైట్ తీసుకునేవారు. కానీ ఇప్పుడు రాహుల్ అంటే లైట్ కాదు ఫైట్ అని నిరూపించారు. రాహుల్ అంటే సిల్లీ పొలిటీషియన్ కాదు సీరియస్ లీడర్ అనుకునేలా చేశారు. అవిశ్వాసంపై చర్చలో భాగంగా.. రాహుల్ గాంధీ స్పీచ్ చూస్తే.. ఎవరికైనా ఇదే అర్థమవుతుంది. అందుకే.. ఇండియా ఇప్పుడు రాహుల్‌ గురించి చర్చిస్తోంది.

రాహుల్.. రాహుల్.. రాహుల్.. ఇప్పుడు ఎక్కడ చూసినా రాహులే. ఏ ఇద్దరు కలిసినా రాహుల్‌ గురించే. ఇప్పుడు రాహుల్ గాంధీనే ట్రెండింగ్‌. మోడీ సర్కార్‌పై నో కాన్ఫిడెన్స్‌పై స్పీచ్ మొదలుపెట్టినప్పటి నుంచి.. రాహుల్‌‌లో ఏమాత్రం కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గలేదు.
అవిశ్వాసంపై లోక్‌సభలో జరిగిన చర్చలో.. రాహుల్ తన దూకుడు చూపించారు. గల్లా జయదేవ్ ప్రసంగం ద్వారా.. ఏపీ ప్రజల బాధ, ఆవేదన తెలిశాయన్నారు. 21వ శతాబ్దపు రాజకీయ ఆయుధానికి ఏపీ ప్రజలు బాధితులని చెప్పారు రాహుల్ గాంధీ.

ఐతే.. ఇక్కడి వరకు తన ప్రసంగాన్ని నెమ్మదిగా మొదలుపెట్టిన రాహుల్.. తర్వాత తనలో ఉన్న ఒక్కో వేరిషన్‌ను బయటపెట్టారు. కేంద్రప్రభుత్వం, ప్రధాని మోడీపై.. తీవ్ర విమర్శలు గుప్పించారు. అడగాల్సినవన్నీ అడిగేసి.. కడిగిపారేశారు. ఎన్డీయే సర్కార్‌ను టార్గెట్ చేస్తూ.. ఆవేశపూరితంగా ప్రసంగించారు. పార్లమెంటులో ప్రసంగించేటప్పుడు రాహుల్ హావభావాలు, కళ్లలో ఆవేశం, మాటల్లో పదును, ఆయన బాడీ లాంగ్వేజ్.. ఇలా వీటన్నింటిని డీకోడ్ చేస్తే.. కేంద్రప్రభుత్వంపై యుద్ధం ప్రకటించినట్లే అనిపించింది.

కాసేపు ఆవేశం.. కాసేపు ఉద్వేగం.. ప్రశ్నలు.. విమర్శలు.. ఆరోపణలు ఇలా ఒక్క రాహుల్ తనలో ఉన్న పది వేరియేషన్స్‌ని చూపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే స్పీచ్ దంచేశారు. రాహుల్‌లో ఇన్ని షేడ్స్ ఉంటాయని సభలో ఉన్నవాళ్లతో పాటు అందరికీ అప్పుడే తెలిసింది. ఆ రేంజ్‌లో ఆకట్టుకుంది మరి రాహుల్ స్పీచ్.

ప్రసంగం ముగిసిన తర్వాత రాహుల్ మోడీ దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. ఈ పరిణామంతో మోడీ అవాక్కయ్యారు. తర్వాత రాహుల్‌ను పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చి భుజం తట్టారు. ఇదే ఇప్పటివరకు హైలెట్ సీన్ అనుకుంటే.. దీనిని మించింది మరొకటుంది. ప్రధానికి హగ్ ఇచ్చిన తర్వాత తన స్థానంలోకి వెళ్లి కూర్చున్న రాహుల్ తోటి సభ్యులు ఏదో అడగటంతో కన్ను కొడుతూ కనిపించారు. ప్రధాని మోడీని రాహుల్ హగ్ చేసుకోవడం తర్వాత కన్నీగీటడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపైనా నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

రాహుల్‌ ఆలింగనం దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా హల్‌చల్‌ చేస్తున్నాయి. వాటిలో కొన్ని...

* ఆలింగనం చేసుకున్నప్పుడు మోదీకి 56అంగుళాల ఛాతీ ఉన్నట్లు నాకు అనిపించలేదని రాహుల్‌ అంటున్నట్లు ఓ నెటిజన్‌ ఇలా కామెంట్‌ పెట్టాడు.

* జులై 20ని అంతర్జాతీయ ఆలింగన దినోత్సవంగా యునెస్కో ప్రకటిస్తుంది.

* గొప్ప ప్రసంగం..గొప్ప ఆలింగనం.. మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌ చిత్రాన్ని రాహుల్‌ మళ్లీ గుర్తు చేశారు.

* మోదీ: అంతేనా!

రాహుల్‌: ఇంకేం కావాలి!

మోదీ: కుదిరితే కప్పు కాఫీ వీలైతే నాలుగు మాటలు..

* ఈ వయసులో నాకు ఇలాంటి సర్‌ప్రైజ్‌లు ఎందుకు రాహుల్‌?

* వీడియో ఆఫ్‌ ది డికేడ్‌!

* రాహుల్‌ మోదీని ఆలింగనం చేసుకున్నాడు కదా! ఇక మోదీ ఇటలీ వెళ్లాల్సిన అవసరం రాదేమో?

* ప్రధాని అయ్యాక విదేశీ నేతలను ఎలా ఆలింగనం చేసుకోవాలో మోదీ వద్ద ఇప్పటినుంచే రాహుల్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారు.

* రాహుల్‌.. మోదీని హగ్‌ చేసుకోమని నీకు ముందే రాసిచ్చిన స్క్రిప్ట్‌లో ఉందా? అంటూ నెటిజన్లు కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు.

Next Story