logo
జాతీయం

పేరు మార్చుకున్న రాహుల్‌గాంధీ

పేరు మార్చుకున్న రాహుల్‌గాంధీ
X
Highlights

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేరు మార్చుకున్నారు. ఎందులో, ఎక్కడ, ఏం పేరు ఇలా డౌట్స్‌ మీద డౌట్స్‌...

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేరు మార్చుకున్నారు. ఎందులో, ఎక్కడ, ఏం పేరు ఇలా డౌట్స్‌ మీద డౌట్స్‌ వస్తున్నాయి కదా.. ఏమీ లేదండి, రాహుల్‌ తన ట్విటర్‌ ఖాతా పేరును మార్చుకున్నారు. ఎందుకనీ అంటే... ఇంత వరకు ఆఫీస్ఆఫ్ఆర్జీ అని ఆయన ట్విట్టర్ పేజీని నడిపారు. అంటే రాహుల్ గాంధీ కార్యాలయం అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపై విమర్శలు ఎక్కువగా వచ్చేవి. గొప్ప కోసం లేదా వెర్రితనంగా దీన్ని సామాజిక మాధ్యమంలో అభివర్ణిస్తూ కామెంట్లు పెట్టేవారు. తన ట్విట్టర్ ఖాతాలో తన పెంపుడు కుక్క ట్వీట్లు పెడుతుందంటూ ఆయన గతంలో విమర్శకులకు సమాధానంగా జోకులు పేల్చారు. మొత్తానికి విమర్శలు లేదా మరేదైనా కారణమేమో గానీ రాహుల్ గాంధీ ట్విట్టర్ పేజీ పేరు ఇప్పుడు రాహుల్ గాంధీగా మారిపోయింది. కాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశంలో రాహుల్‌ ప్రసంగించడానికి కొద్ది గంటల ముందే ఈ మార్పు జరిగింది. పేరుతో పాటు ప్రొఫైల్‌ ఫొటోను కూడా మార్చారు.


Next Story