logo
జాతీయం

దేశ భవిష్యత్, రాజ్యాంగాన్ని కాపాడతాం...మేము గతాన్ని తవ్వుకోవాలనుకోవడం లేదు

దేశ భవిష్యత్, రాజ్యాంగాన్ని కాపాడతాం...మేము గతాన్ని తవ్వుకోవాలనుకోవడం లేదు
X
Highlights

దేశ భవిష్యత్, రాజ్యాంగాన్ని కాపాడతామని చెప్పారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. బీజేపీని వ్యతిరేకించే అన్ని...

దేశ భవిష్యత్, రాజ్యాంగాన్ని కాపాడతామని చెప్పారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. బీజేపీని వ్యతిరేకించే అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకొస్తామని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు.. బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసేందుకు వివిధ పార్టీల నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. అందులో భాగంగా రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లిన చంద్రబాబు గంటసేపు పైగా ఆయనతో భేటీ అయ్యారు. దేశ, రాష్ట్ర రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం రాహుల్, చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. బీజేపీని గద్దె దించేందుకు కలిసి పనిచేస్తామని చెప్పారు. తాము గతాన్ని తవ్వుకోవడం లేదని, ప్రస్తుత పరిణామాలపై ఆలోచిస్తున్నామని చెప్పారు.

Next Story