కీలక సమయంలో ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు

132 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీకి రాహుల్ గాంధీ అధ్యక్షుడు కాబోతున్నారు. ఇప్పటికే ఈ పదవికి సంబంధించిన ఎన్నిక...
132 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీకి రాహుల్ గాంధీ అధ్యక్షుడు కాబోతున్నారు. ఇప్పటికే ఈ పదవికి సంబంధించిన ఎన్నిక పూర్తయింది. డిసెంబర్ 16న యువరాజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం లాంఛనం కానుంది. ఈ ప్రకటన డిసెంబర్ 11న అధికారికంగా వెలువడనుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ ముళ్లపల్లి రామచంద్రన్ స్వయంగా వెల్లడించారు. రాహుల్ గాంధీ డిసెంబర్ 11న దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ సీనియర్లతో కేంద్ర కార్యాలయంలో సమావేశం కానున్నారు. అనంతరం సోనియా గాంధీ రాహుల్‌ను అధ్యక్షుడిగా ప్రకటించనున్నారు. డిసెంబర్ 16న అధికారికంగా రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు.
అయితే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న రాహుల్ గాంధీకి ఎన్నో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. దేశం మొత్తం మీద ఐదు రాష్ట్రాల్లో, ఒక కేంద్ర పాలిత ప్రాంతం.. పుదుచ్చేరిలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌కు ఇటీవలే ఎన్నికలు జరిగాయి. ఈ రెండు రాష్ట్రాలతో పాటు కర్నాటకకు 2018లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల ఫలితాలు రాహుల్ గాంధీ నాయకత్వానికి అగ్ని పరీక్షగా మారనున్నాయి.
కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఈనెల 16న పగ్గాలు చేపట్టనున్నారు. దాదాపు 19ఏళ్ల పాటు పార్టీ బాధ్యతలు చూసుకున్న సోనియాగాంధీ ఆరోజు తనయుడు రాహుల్‌కు ఆ బాధ్యతలను అప్పగించనున్నారు. దీనికి సంబంధించి పార్టీ నుంచి నేడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే ఈనెల 16న సోనియాగాంధీ, ఇతర సీనియర్ నేతల సమక్షంలో పార్టీ అధ్యక్ష పదవి పదవి నియామకానికి సంబంధించిన సర్టిఫికెట్‌ను రాహుల్‌కు అందజేయనున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలను కలుసుకున్న అనంతరం మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో పార్టీ అధ్యక్ష పగ్గాలను రాహుల్ స్వీకరించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో యువరాజు పట్టాభిషేకంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి.
వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న సీఎల్పీ బృందం
16 Aug 2022 4:06 AM GMTHar Ghar Tiranga: జాతీయ జెండాను ఎలా భద్రపరచాలి..
15 Aug 2022 11:55 AM GMTBandi Sanjay: డీజీపీకి డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్
15 Aug 2022 9:19 AM GMTతెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు
15 Aug 2022 8:15 AM GMTగోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15 Aug 2022 6:33 AM GMTచిరంజీవి బ్లడ్ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 6:17 AM GMTమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 4:49 AM GMT
సూర్యుడి ఏజ్‌ను నిర్ధారించిన యురోపియన్ స్పేస్ ఏజెన్నీ..
16 Aug 2022 4:15 PM GMTబాలీవుడ్‌పై బాయ్‌కాట్ పడగ.. టాప్ హీరోలు చేసిన తప్పేంటి?
16 Aug 2022 4:00 PM GMTకొత్త స్టార్టప్ సంస్థను అనౌన్స్ చేసిన రతన్‌టాటా.. సీనియర్ సిటిజన్స్...
16 Aug 2022 3:45 PM GMTరైతులకి పెద్ద ఉపశమనం.. వారికి 4000 రూపాయలు..!
16 Aug 2022 3:30 PM GMTAsaduddin Owaisi: ఆర్టికల్ 370 రద్దు చేసి ఏం సాధించారు? కశ్మీర్లో...
16 Aug 2022 3:15 PM GMT