బీజేపీలోకి ద్రవిడ్..కుంబ్లే ?

టీమిండియా మాజీ దిగ్గజాలు అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్‌లు బీజేపీలో చేరబోతున్నారా? అవుననే అంటున్నారు బీజేపీ...
టీమిండియా మాజీ దిగ్గజాలు అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్‌లు బీజేపీలో చేరబోతున్నారా? అవుననే అంటున్నారు బీజేపీ నేతలు. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వారిద్దరినీ ఎలాగైనా పార్టీలో చేర్చుకోవడం ద్వారా లబ్ధి పొందాలని బీజేపీ భావిస్తోంది. మే నెలలో కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరిద్దరిని బరిలోకి దించి ప్రచారం చేయించాలని భావిస్తోంది. ఐతే, వీరిద్దరూ రాజకీయ ప్రవేశం చేసేందుకు సిద్ధంగా లేనట్లు సమాచారం.
ఇదే విషయాన్ని స్థానిక భాజపా నేతలు అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్‌లతో చర్చించగా వీరు విముఖత చూపించారు. అయితే వారిని ఎలాగైనా ఒప్పించాలని భాజపా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. వారిలో ఒకరిని రాష్ట్ర అసెంబ్లీ బరిలోకి దింపి.. మరొకరిని జాతీయ రాజకీయాల్లోకి పంపుతామని కూడా ఆఫర్ ఇచ్చింది. అయితే వారు రాజకీయాల్లోకి వచ్చేందుకు నిరాకరించినట్లు సమాచారం. దీనిపై భాజపా నేతలు మాట్లాడుతూ.. ‘కుంబ్లే, ద్రవిడ్‌తో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. కనీసం వారిలో ఒకరినైనా లోక్‌సభ లేదా రాజ్యసభ బరిలో దింపుతాం. ఇంకా మాకు ఆశలు ఉన్నాయి.’ అని తెలిపారు. ఇదే విషయంపై కుంబ్లే, ద్రవిడ్ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. కర్ణాటకలో మే 12న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కుంబ్లే ఆ తర్వాత భారత జట్టుకు కోచ్‌గా సేవలు అందించారు. ప్రస్తుతం ఐపీఎల్ 11వ సీజన్‌కు కామెంటేటర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. మరో పక్క ద్రవిడ్ ఇండియా-ఎ, అండర్-19 జట్లకు కోచ్‌గా ఉన్న సంగతి తెలిసిందే.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT