కన్నకొడుకులా ఓ కుటుంబానికి సాయం చేసిన టాప్ హీరో

జల్లికట్టు ఉద్యమంలో మృతిచెందిన యువకుడి కుటుంబానికి నటుడు, దర్శకుడు, డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ బాసటగా...
జల్లికట్టు ఉద్యమంలో మృతిచెందిన యువకుడి కుటుంబానికి నటుడు, దర్శకుడు, డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ బాసటగా నిలిచాడు. జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ గత ఏడాది చెన్నైలోని మెరీనా తీరంలో ప్రారంభమైన ఉద్యమం తమిళనాడు వ్యాప్తంగా ఊపందుకుంది. ఆ సమయంలో విద్యార్థులు, యువకులు, స్వచ్ఛంధ సంస్థలు, సినీనటులు స్వయంగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సేలంలో జరిగిన రైల్‌రోకోలో యోగేశ్వరన్ (17) రైలింజన్ పైకి ఎక్కడంతో విద్యుదాఘాతానికి గురై మరణించాడు.
అతడి భౌతికకాయానికి నివాళులర్పించేందుకు వెళ్లిన లారెన్స్ మృతుడి తల్లిదండ్రులను పరామర్శించారు. ‘మనం ఉండేందుకు ఇల్లు కట్టిస్తానని పేర్కొన్న కుమారుడు చిన్నతనంలోనే మృతిచెందాడంటూ’ తల్లిదండ్రులు ఏడుస్తూ చెప్పడంతో, తానే మీ కుమారుడిలా ఇల్లు కట్టిస్తానని లారెన్స్ హామీ ఇచ్చాడు. అనంతరం లారెన్స్ ఉత్తర అమ్మాపేటలో 800 చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేసి 500 చదరపు అడుగుల్లో ఇంటిని నిర్మించాడు. రూ.22 లక్షలతో నిర్మించిన ఇంటి తాళాలను బుధవారం లారెన్స్ మృతుడు యోగేశ్వరన్ కుటుంబసభ్యులకు అప్పగించాడు.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
ముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMTKidney Stone: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా.. అసలు విషయం...
12 Aug 2022 1:30 PM GMT