రాహుల్ తో ముగిసిన ఉత్తమ్, కుంతియా స్క్రినింగ్ కమిటీ సభ్యుల భేటీ

x
Highlights

స్క్రీనింగ్‌ కమిటీ రూపొందించిన జాబితాపై అధినేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన అభ్యర్ధులను ఖరారు చేశారో చెప్పాలంటూ నిలదీయడంతో నేతలు...

స్క్రీనింగ్‌ కమిటీ రూపొందించిన జాబితాపై అధినేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన అభ్యర్ధులను ఖరారు చేశారో చెప్పాలంటూ నిలదీయడంతో నేతలు పునరాలోచనలో పడినట్టు సమాచారం. దీంతో తమకు అందిన జాబితాతో ఎంపిక చేసిన అభ‌్యర్ధుల వివరాలను తీసుకుని స్క్రీనింగ్ కమిటీ సభ్యులు రాహుల్ నివాసానికి చేరుకున్నారు. వీరితో పాటు టీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ కుంతియా, భక్త చర‌ణ్ దాస్‌లు కూడా రాహుల్ నివాసానికి చేరుకున్నారు.

స్క్రీనింగ్ కమిటీ జాబితాలో సొంత పార్టీల వారు ఎంత మంది ఉన్నారు ? ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు ఎంత మంది ఉన్నారనే దానిపై రాహుల్ ఆరా తీస్తున్నారు. ఇప్టటికే సామాజిక వర్గాల వారిగా సీట్ల వివరాలు సిద్ధం చేసిన సభ్యులు రాహుల్‌కు అందజేయనున్నారు.అభ్యర్థుల ఎంపికలో అనుసరించిన విధానం, అభ్యర్థుల సామర్థ్యం, గెలుపు అవకాశాలున్న వారి జాబితాను రాహుల్ ఆసాంతం పరిశీలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories