పీకల్లోతు ప్రేమలో మునిగిన హాట్ కపుల్

బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు ఎక్స్ పోర్ట్ అయిన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, తన ప్రియుడు నిక్ జోనాస్ తో...
బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు ఎక్స్ పోర్ట్ అయిన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, తన ప్రియుడు నిక్ జోనాస్ తో సాగిస్తున్న ప్రేమాయణానికి ముగింపు పలకబోతోందా..? త్వరలోనే ఓ ఇంటి పక్షులవుతారా..? పీకల్లోతు ప్రేమలో ఉన్న వారిద్దరూ ఒక్కటయ్యేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా..? ప్రస్తతం గోవా వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఈ జంట వచ్చే నెలలోనే నిశ్చితార్థానికి డేట్ ఫిక్స్ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
క్వాంటికో, బేవాచ్ సిరీస్‌లతో హాలీవుడ్ లో సత్తా చాటి, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పాప్ సింగర్ నిక్ జోనాస్‌తో డేటింగ్‌లో ఉందన్న ఊహాగానాలు మొన్న ముంబైలో ఈ జంటను చూసిన తర్వాత నిజమయ్యాయి. తొలుత అమెరికా లాస్ ఏంజెలెస్ లో బ్యూటీ అండ్ ది బీస్ట్ లైవ్ కాన్సర్ట్ తో వీరిద్దరూ చెట్టాపట్టాలు వేసుకుని కనిపించడంతో ప్రియాంక లవ్ మ్యాటర్ బయటపడింది.
అప్పటి నుంచి వీరిద్దరూ చాలా ప్రాంతాల్లో కెమెరాలకు చిక్కారు. అమెరికా వీధుల్లో వీరిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. జూన్ 21 న ఈ ఇద్దరూ కలిసి ముంబైకి రావడం సంచలనంగా మారింది. అంతకుముందే నిక్ తన కజిన్ మ్యారేజ్ సెర్మనీలో ప్రియురాలు ప్రియాంకను తల్లిదండ్రులకు పరిచయం చేశారు. ప్రస్తుతం ప్రియాంక తన తల్లిదండ్రులకు జోనాస్‌ను పరిచయం చేయించేందుకే తీసుకొచ్చారని చెబుతున్నారు.
ప్రస్తుతం గోవా వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఈ జంట బీచ్, రిసార్టులలో సాగిస్తున్న ప్రేమాయణం తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే వచ్చే నెలలోనే వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకుంటారని తెలుస్తోంది. జూలై చివరివారం లేదా ఆగస్ట్ తొలివారంలో వేడుక జరగనుందని దీనికి ఇరు కుటుంబాలను ఒప్పించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి చాటు మాటు ప్రేమాయణంతో రహస్య స్నేహితుడితో సాగిస్తున్న ప్రేమాయణానికి త్వరలోనే ఫుల్ స్టాప్ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMT
Mahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTClove Oil: లవంగం నూనెతో పురుషులకి బోలెడు లభాలు.. తెలిస్తే షాక్...
26 May 2022 2:30 PM GMTసల్మాన్ ఖాన్ రీమేక్ సినిమాకి నో చెప్పిన తరుణ్ భాస్కర్
26 May 2022 1:30 PM GMTతెలంగాణలో హ్యుందయ్ కంపెనీ భారీ పెట్టుబడులు
26 May 2022 1:00 PM GMTEPFO: మీరు ఈ విషయాన్ని మరిచిపోతే పీఎఫ్ ఖాతా క్లోజ్ అవుతుంది...
26 May 2022 12:30 PM GMT