డీసీఎంలో 7 నెలల గర్భిణిపై అత్యాచారయత్నం.. గర్భిణి దుర్మరణం

Highlights

మెదక్‌ జిల్లాలో దారుణం జరిగింది. మానవత్వానికి మచ్చతెచ్చేలా వ్యవహరించారు మృగాళ్లు. ఊరు వెళ్లేందుకు డీసీఎం వ్యాన్‌లో ఎక్కిన ఏడు నెలల గర్బిణీపై అత్యాచారం...

మెదక్‌ జిల్లాలో దారుణం జరిగింది. మానవత్వానికి మచ్చతెచ్చేలా వ్యవహరించారు మృగాళ్లు. ఊరు వెళ్లేందుకు డీసీఎం వ్యాన్‌లో ఎక్కిన ఏడు నెలల గర్బిణీపై అత్యాచారం చేసేందుకు యత్నించడంతో బాధితురాలు వారి తప్పించుకునేందుకు వ్యాన్‌లో నుంచి కిందికి దూకేసింది. దీంతో గర్బిణీ తీవ్రగాయాల పాలయి చనిపోయింది. మెదక్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం రావెళ్లి శివారులో పోతరాజ్‌పల్లికి చెందిన దంపతులు పాతదుస్తులు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండ్రోజుల క్రితం మేడ్చల్‌ జిల్లా కొంపల్లిలో పాతదుస్తులు విక్రయించిన తర్వాత స్వగ్రామానికి కరీంగూడ వెళ్లేందుకు రెడీ అయింది బాధితురాలు. రాత్రి 10 గంటల సమయంలో పెద్ద కుమార్తె శిరీషతో కలిసి డీసీఎంలో ఎక్కింది.

డీసీఎం వ్యాన్‌లో ఉన్న డ్రైవరు, మరో వ్యక్తి గర్బిణీతో కర్కశంగా ప్రవర్తించారు. గర్బిణీపై అత్యాచారయత్నం చేసేందుకు యత్నించారు. 44వ జాతీయ రహదారిపై రావెళ్లి శివారులో కరీంగూడ వద్ద వాహనం ఆపకుండా వెళ్లారు. దీంతో భయపడ్డ బాధితురాలు కదులుతున్న వాహనంలో నుంచి కిందకు దూకింది. అరకిలో మీటరు ముందుకెళ్లిన తర్వాత దుండగులు బాలికను వదిలేశారు దుండగులు.

Show Full Article
Print Article
Next Story
More Stories