షాకింగ్ ఘటన..యూట్యూబ్‌లో చూసి.. ప్రాణాల మీదకు..

యూట్యూబ్ లో ఇంట్లోనే ప్రసవాన్ని ఎలా చేసుకోవచ్చన్న వీడియోలను పదే పదే చూసిన ఓ జంట, ఆ సూచనలను పాటిస్తూ,...
యూట్యూబ్ లో ఇంట్లోనే ప్రసవాన్ని ఎలా చేసుకోవచ్చన్న వీడియోలను పదే పదే చూసిన ఓ జంట, ఆ సూచనలను పాటిస్తూ, ప్రసవానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టి భార్య ప్రాణాలను బలిగొంది. తమిళనాడులోని తిరుపూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, తిరుపూర్‌లోని రత్నగిరీశ్వరనగర్‌కు చెందిన కృతిక(28) ఆమె ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. కృతిక భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు ఇంతకు ముందే మూడు సంవత్సరాల వయసున్న పాప ఉంది. ఈ దంపతులిద్దరూ ఇంటిలోనే యూట్యూబ్ వీడియోలను ఫాలో అవుతూ బిడ్డకు జన్మనివ్వాలని ముందే నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కృతిక మరోసారి గర్భం దాల్చింది. డెలివరీ వేళ, ఇంట్లోనే బిడ్డకు జన్మనివ్వాలని భావించిన ఈ జంట, ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయంలో యూట్యూబ్ వీడియోలను చూశారు. తర్వాత నెలలు నిండి నొప్పులు ప్రారంభమైతే, తాము వీడియోలో చూసినట్టుగా చేశారు. అయితే, బిడ్డ పుట్టిన తరువాత కృతికకు తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో భయపడిన భర్త ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లే సరికే మరణించింది. విషయం తెలుసుకున్న పోలీసులు, భర్తను అరెస్ట్ చేసి, కేసును విచారిస్తున్నారు. కృతిక స్నేహితురాలు ఒకరు సహజ ప్రసవాలు చేస్తుండేదని, ఆమె సూచనతోనే ఈ పని చేశామని అతను చెప్పినట్టు సమాచారం.
V Hanumantha Rao: ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తా..
13 Aug 2022 9:25 AM GMTహైదరాబాద్‌లో గ్రాండ్‌గా తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్-2022
13 Aug 2022 8:17 AM GMTKomatireddy Venkat Reddy: అద్దంకి దయాకర్‌ను ఎందుకు సస్పెండ్ చెయ్యలేదు..?
12 Aug 2022 9:55 AM GMTTS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMT
CIBIL Score: పర్సనల్ లోన్‌కి అర్హులా కాదా అంటే సిబిల్ స్కోరు...
14 Aug 2022 11:30 AM GMTBandi Sanjay: ఆలేరు నియోజకవర్గం తుర్కల షాపూర్లో ప్రజాసంగ్రామ యాత్ర
14 Aug 2022 11:27 AM GMTవైసీపీ ప్రభుత్వ అసమర్థ పనితీరు వల్లే...రాష్ట్రానికి పెట్టుబడులు రావడం...
14 Aug 2022 11:05 AM GMTStress: ఈ లక్షణాలు కనిపిస్తే తీవ్రమైన ఒత్తిడి.. ఎలా బయటపడాలంటే..?
14 Aug 2022 10:30 AM GMTఖమ్మం జిల్లా ఖాన్‌పేట్‌లో భట్టి విక్రమార్క పాదయాత్ర
14 Aug 2022 10:27 AM GMT