ఆమెకు వయసు 52.. 16 మంది పిల్లలను కనాలన్న ఆశ.. పదోసారి గర్భంతో పరార్...

ఆమె వయస్సు 52 ఏళ్లు ఇప్పటికే 9 మంది సంతానం మళ్లీ గర్భం దాల్చింది. పదవ బిడ్డను జన్మనిచ్చేందుకు సిద్ధంగా ఉంది....
ఆమె వయస్సు 52 ఏళ్లు ఇప్పటికే 9 మంది సంతానం మళ్లీ గర్భం దాల్చింది. పదవ బిడ్డను జన్మనిచ్చేందుకు సిద్ధంగా ఉంది. కానీ ప్రభుత్వ ఆస్పత్రిలో విషయం తెలిస్తే కుటుంబ నియంత్రణ చేస్తారన్న భయంతో ఆమె భర్తతో కలిసి అదృశ్యమైన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆమె కోసం తన బంధువులు గాలిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని వెతియన్గుడికి చెందిన ఆరాయి వయస్సు 52 ఏళ్లు. ఇప్పటికే ఆమె తొమ్మిదిమందికి జన్మనిచ్చింది. ఇప్పుడు పదవ బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధమైంది. గర్భంతో ఉన్న ఆరాయి కడుపులో కొంత ఇబ్బందిగా ఉండటంతో సింగవనం అనే గ్రామంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు డెలివరీ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి తెలిపారు. అయితే ఇక్కడే చిక్కొచ్చి పడింది. ఆమెకు 9మంది సంతానం ఉన్నారన్న సంగతి తెలిస్తే వైద్యులు ఎక్కడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తారేమోనని ఆమె భర్త ఆనందన్‌తో కలిసి హాస్పిటల్ నుంచి పారిపోయింది. డాక్టర్ అయ్యప్పన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగుడి పోలీసులు కేసు నమోదు చేసి ఆరాయి కోసం గాలిస్తున్నారు. దీనిపై స్థానిక ప్రజలు మాట్లాడుతూ ఆనందన్, అతని భార్యకు 16 మంది పిల్లలను కనాలన్న ఆశ ఉందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకుంటే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేస్తారనే భయంతో ఆరాయి తన భర్తతో అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలిపారు.
గోరంట్ల మాధవ్ విషయంలో అతిగా స్పందించొద్దు.. వంగలపూడి అనితకు బెదిరింపు కాల్స్..
9 Aug 2022 10:22 AM GMTJayasudha: బీజేపీలోకి సినీనటి జయసుధ...?
9 Aug 2022 8:03 AM GMTటీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు
9 Aug 2022 7:50 AM GMTTelangana News: వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే
8 Aug 2022 9:38 AM GMTBreaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMT
ఈనెల 11న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలపై చర్చ..
9 Aug 2022 11:04 AM GMTNitish Kumar: బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా
9 Aug 2022 10:49 AM GMTRashmika Mandanna: కష్టానికి అదృష్టం తోడైంది...
9 Aug 2022 10:39 AM GMTగోరంట్ల మాధవ్ విషయంలో అతిగా స్పందించొద్దు.. వంగలపూడి అనితకు బెదిరింపు...
9 Aug 2022 10:22 AM GMTTelangana News: కన్నుల పండువగా.. ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ
9 Aug 2022 10:13 AM GMT