పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు..తెలుగు నిర్మాతలతో గొడవలు

Highlights

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ నేషనల్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పాలిటిక్స్ , సినిమాలు, పవన్, తెలుగు...

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ నేషనల్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పాలిటిక్స్ , సినిమాలు, పవన్, తెలుగు నిర్మాతలతో గొడవపై స్పందించారు.
నోట్లరద్దు
నోట్ల రద్దుపై స్పందించిన ప్రకాష్ రాజ్ నల్లధనం పెరిగిపోయిందని చెప్పుకొచ్చారు. నోట్లరద్దు మంచి నిర్ణయమే కానీ తీసుకొచ్చిన విధానం సరిగా లేదని అన్నారు.
పాలకుల్ని ప్రశ్నిస్తా
ప్రజల చేత, ప్రజలకొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల పనితీరుపై అందరికి ప్రశ్నించే హక్కు ఉంది. కాబట్టే ఎవరు ఏమనుకున్నా ఓ బాధ్యతగల పౌరుడిగా ప్రశ్నిస్తా.
నోపాలిటిక్స్
తనతో అత్యంత సన్నిహితంగా ఉండే కమల్ హాసన్ పాలిటిక్స్ పై తనదైశైలిలో స్పందించారు. తనకు పాలిటిక్స్ అంటే పడదు. పార్టీ గురించి, పార్టీ విధి విదానాల గురించి కమల్ హాసన్ చర్చించలేదు. కమల్ పార్టీలో చేరేందుకు నేను సిద్ధం లేదని స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ చేస్తున్న పాలిటిక్స్ చాలా బాగున్నాయని కొనియాడారు. అంతేకాదు పవన్ కల్యాణ్ ఆశయాలు, ఆవేదన తనకు తెలుసు అన్నారు. పవన్ తనకు నచ్చాడని ప్రకాశ్ రాజ్ చెప్పారు. పవన్ కల్యాణ్ పార్టీ విధానాలు నచ్చితే మద్దతిస్తానని ఆయన వివరించారు.
ప్రశ్నిస్తా
ప్రశ్నించే హక్కు నాకుంది. అలా ప్రశ్నిస్తాను కాబట్టే తప్పులపై ప్రశ్నిస్తే యాంటీ మోదీ ట్యాగ్ తగిలిస్తున్నారని ప్రకాశ్ రాజ్ అన్నారు. 'నా ప్రశ్నలకు మీ దగ్గర జవాబు లేదా? లేక దొరికిపోతామనే భయమా?' నేను మాట్లాడితే మీకు కంగారెందుకు, బెదిరింపులు ఎందుకు అని ఆయన నిలదీశారు.
టాలీవుడ్ నిర్మాతలతో గొడవలు
తెలుగు నిర్మాతలతో జరిగిన గొడవపై స్పందించిన ప్రకాష్ రాజ్.తాను అన్నీ కరెక్ట్ గా చేస్తానని ఒక్కోసారి అవి కరెక్ట్ కాకపోవచ్చు. తన వైఖరి కారణంగా టాలీవుడ్‌ నిర్మాతలతో గొడవజరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories