logo
సినిమా

భాగమతిలో బాహుబలి ట్విస్ట్ !

X
Highlights

రేపు విడుదలకాబోతున్న ‘భాగమతి’ రిజల్ట్ కోసం అనుష్క ఫాన్స్ మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు అంతా...

రేపు విడుదలకాబోతున్న ‘భాగమతి’ రిజల్ట్ కోసం అనుష్క ఫాన్స్ మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసంక్రాంతికి విడుదల అయిన భారీ సినిమాలు అన్నీ ఘోర పరాజయం చెందడంతో ఈ ఏడాది మొట్టమొదటి సూపర్ హిట్ మూవీగా ‘భాగమతి’ మారబోతోంది అన్న అంచనాలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ‘అరుంధతి’ తరహాలో అవుట్ అండ్ అవుట్ హారర్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు అశోక్ దీన్ని తీర్చిదిద్దిన విధానం అందరికీ బాగా నచ్చుతుంది అని ఈ సినిమా ఫైనల్ కాపీ చుసిన వారు చెపుతున్నారు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై ‘పిల్ల జమీందార్‌’ ఫేమ్‌ అశోక్ తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించింది.

యాక్షన్‌ థిల్లర్‌గా పలు భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ప్రమోషనల్‌ సాంగ్ వీడియోను విడుదల చేశారు. అనుష్క హాట్‌గా, గ్లామరస్‌గా కనిపించిన ఈ ప్రమోషన్‌ వీడియోలో ఓ స్పెషల్‌ ఎఫెక్ట్‌ ఇప్పుడు అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందుకు కారణం.. ఈ వీడియోలో ప్రభాస్‌ అనూహ్యంగా దర్శనమివ్వడమే.. షూటింగ్‌ స్పాట్‌కు వచ్చిన ప్రభాస్‌ ముఖానికి కర్చీఫ్‌ కట్టుకొని ఉండగా.. అలా చూపించి చూపించనట్టు ఇందులో చూపించారు. ముఖానికి కర్చీఫ్‌ కట్టుకున్నా.. అతను బహుబలి గుర్తించడం పెద్ద కష్టమేమీ కాదు.. ఈ విషయాన్ని గుర్తించిన అభిమానులు ఈ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. మూడు నిమిషాల 27 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఒక నిమిషం 50 సెకన్ల వద్ద ప్రభాస్‌ తళుక్కున మెరుస్తాడు. ప్రభాస్ ఈ సినిమాలో ఏమైనా ప్రత్యేక పాత్ర చేసాడా అన్న కోణంలో ప్రభాస్ అభిమానులు చర్చలు చేస్తున్నారు.

Next Story