సాహోలో ప్రభాస్ పాత్రపై ఇంట్రెస్టింగ్ న్యూస్

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తోన్న మూవీ సాహో. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తోన్న ఈ మూవీలో ప్రభాస్ పాత్ర ఏంటి, ఎలా...
బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తోన్న మూవీ సాహో. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తోన్న ఈ మూవీలో ప్రభాస్ పాత్ర ఏంటి, ఎలా కనిపించబోతున్నాడనే వార్త అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా సాహోలో ప్రభాస్ పాత్ర గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. ఇందులో ప్రభాస్ టూ షేడ్స్ లో కనిపించబోతున్నాడు.
బాహుబలితో ప్రభాస్ నెక్ట్స్ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఆ ఎక్స్ పెక్టేషన్స్ ను రీచ్ కావడానికి సాహో మూవీని భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడు. అంతర్జాతీయ కంథాంశంతో, హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ థ్రిల్లర్ ను ముస్తాబు చేస్తున్నాడు. సుజిత్ దర్శకత్వం అందిస్తోన్నసాహో 150కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. సాహోలో ప్రభాస్ క్యారెక్టర్ ఏంటనేదానిపై కొంతకాలంగా ఉంత్కంఠ నెలకొంది. దీనిపై ఓ ఇంట్రెస్ట్ న్యూస్ బయటికి వచ్చింది. ఇందులో ప్రభాస్ పాజిటీవ్ అండ్ నెగిటివ్ టూ షేడ్స్‌లో కనిపించబోతున్నాడు.
సాహో మూవీలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా, ముసుగు దొంగగా టూ షేడ్స్ లో కనిపించనున్నాడు. పాత్ర ఒక్కటే ఐనా రెండు విభిన్న పాశ్వాలను చూపించబోతున్నాడు. పోలీస్ క్యారెక్టర్ లో ఉన్న దొంగా?లేక నిజాయతీ గల అధికారే దొంగ ముసుగులో కనిపించనున్నాడా అనేది సస్పెన్స్ గా మారింది. అందుకే సాహో ఫస్ట్ లుక్ లో ముసుగు దొంగ లా ఉండే లుక్ ను రిలీజ్ చేశారు.
సాహో మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ కు కూడా ప్రాధాన్యత ఉన్నట్టు తెలుస్తోంది. ఏదో నాలుగు పాటలు, మూడు గ్లామర్స్ సీన్స్ లా కాకుండా స్టోరీలో కీలక పాత్ర పోషించనుందట. హీరోయిన్ గా నటిస్తోన్న శ్రద్దాకపూర్ కు కూడా యాక్షన్ సీన్స్ ఉన్నాయట. అమ్మడు సాహో మూవీకి ప్రేత్యేకంగా ఫైట్ సీన్స్ కూడా నేర్చుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ జరుగుతోంది. హాలీవుడ్ టెక్నిషియన్స్ ను ఉపయోగించి యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. బాలీవుడ్ నటీనటులు నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
సాహో మూవీలో ప్రధాన యాక్షన్ సన్నివేశాలను దుభాయ్ లో చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. కానీ అక్కడి ప్రభుత్వం నుంచి షూటింగ్ కు అనుమతి రాకపోవడంతో..హైద్రాబాద్ లో షెడ్యూల్ కు ప్లాన్ చేశారు. ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ అనుమతికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ఓకే అయితే నెక్ట్స్ షెడ్యూల్ ను దుబాయ్ కి షిఫ్ట్ చేస్తారు. మూడు భాషల్లో సినిమా రిలీజ్ కానుంది.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
26 మందికి కరోనా.. 13వేల మంది క్వారంటైన్..
21 May 2022 1:00 PM GMTయమునోత్రి వెళ్లే దారిలో కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల ...
21 May 2022 12:45 PM GMTRevanth Reddy: జయశంకర్ పేరు కాలగర్భంలో కలపాలని సీఎం చూస్తున్నారు..
21 May 2022 12:23 PM GMTDiabetics: మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఈ జ్యూస్ దివ్యఔషధం..!
21 May 2022 12:00 PM GMTMLC Kavitha: రచ్చబండ కొచ్చే కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి చూపించండి
21 May 2022 11:30 AM GMT