logo
సినిమా

కొత్త సినిమా ప్రారంభించిన ప్రభాస్‌

కొత్త సినిమా ప్రారంభించిన ప్రభాస్‌
X
Highlights

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్..సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ.150 బడ్జెట్‌తో ‘సాహో’ మూవీని చేస్తున్నాడు. ఈ మూవీని...

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్..సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ.150 బడ్జెట్‌తో ‘సాహో’ మూవీని చేస్తున్నాడు. ఈ మూవీని ఒకేసారి తెలుగు, తమిళం, హిందీ మూడు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ మరో సినిమా ఖరారైనట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రభాస్ స్వయంగా తన అఫీషియల్ ఫేస్ బుక్ పేజీ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. సాహో తర్వాత తాను చేస్తున్న సినిమా గురువారం(సెప్టెంబర్ 6)న ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ చిత్రం 2019లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కె కె రాధా కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంద‌ని చెప్పిన ప్ర‌భాస్‌, ఈ చిత్రాన్ని గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న‌ట్టు పేర్కొన్నాడు. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రం అతి త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుందని కూడా తెలియ‌జేశాడు.

Next Story