ప్రభాస్ కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు

ప్రభాస్ కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు
x
Highlights

ప్రముఖ సీని నటుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇల్లు సీజ్ చేయడంపై ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా ప్రభాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై...

ప్రముఖ సీని నటుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇల్లు సీజ్ చేయడంపై ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా ప్రభాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ప్రభాస్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. యథాతధ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభాస్ పిటిషన్ పై ఈనెల24న కౌంటర్ దాఖాలు చేయాలని తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 31కి హైకోర్టు వాయిదా వేసింది. రాయదుర్గంలోని పన్మక్తా గ్రామ రెవెన్యూ సర్వే నంబరు 46లో గల 84 ఎకరాల 30 గుంటల భూమి సర్కారుదేనంటూ సుప్రీం కోర్టు తీర్పునివ్వడంతో శేరిలింగంపల్లి తహసీల్దార్‌ వాసుచంద్ర ఆ స్థలంలోని నిర్మాణాలు తొలగించి దాన్ని స్వాధీనం చేసుకున్నా విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories