Top
logo

ప్రభాస్‌ను అన్నయ్య అని పిలవలేను: అనుష్క

ప్రభాస్‌ను అన్నయ్య అని పిలవలేను: అనుష్క
X
Highlights

గత కొంతకాలంగా ప్రభాస్ కు, అనుష్కకూ మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోందని, వారిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని వస్తున్న...

గత కొంతకాలంగా ప్రభాస్ కు, అనుష్కకూ మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోందని, వారిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని వస్తున్న వార్తలను ఇద్దరూ ఖండించినప్పటికీ, రూమర్స్ మాత్రం ఆగలేదన్న సంగతి తెలిసిందే. అనుష్క టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం ‘భాగమతి’. ఈ చిత్ర తమిళ ఆడియో వేడుక బుధవారం చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తన వృత్తి, వ్యక్తిగత విషయాలను అనుష్క ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో అనుష్క కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మధ్యకాలంలో అందరూ నా పెళ్లి గురించి అడుగుతున్నారు. నేనైతే పెళ్లి గురించి ఆలోచించడమే మానేశాను. నాకోసం మీరే ఓ మంచి అబ్బాయిని వెతికిపెట్టండి. మరోవిషయం..ప్రభాస్‌ నాకు కేవలం మంచి మిత్రుడు మాత్రమే. అతన్ని అన్నయ్య అని పిలవలేను. అందరు అబ్బాయిల్నీ మనం అన్నయ్యగా భావించలేం కదా? నేను అసలు వార్తాపత్రికలే చదవను. అందుకే నా గురించి ఎలాంటి వార్తలు వస్తున్నాయో తెలీదు అని వ్యాఖ్యానించింది.

Next Story