logo
సినిమా

పూనమ్‌కౌర్‌కు కత్తి మహేష్ ఆరు ప్రశ్నలు

పూనమ్‌కౌర్‌కు కత్తి మహేష్ ఆరు ప్రశ్నలు
X
Highlights

పూనమ్ కౌర్ తన 6 ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు కత్తి మహేష్. సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టిన...

పూనమ్ కౌర్ తన 6 ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు కత్తి మహేష్. సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టిన ఆయన.. పవన్ ఫ్యాన్స్ తనపై సామాజిక దాడి చేశారన్నారు. ఫ్యాన్స్ ఇంత చేస్తున్నా.. పవన్ ఒక్కసారి కూడా స్పందించలేదన్నారు. ఫ్యాన్స్‌ను కాపాడలేని వ్యక్తి.. రాష్ట్రాన్ని ఎలా కాపాడతారని ప్రశ్నించారు కత్తి మహేష్. పవన్ వీరాభిమాని అయిన పూనమ్ తన అభిమాన హీరోపై విమర్శలు చేస్తున్న కత్తికి సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చింది. దీంతో కత్తి మహేష్ తన పదునైన వ్యాఖ్యలను పూనంపై ప్రయోగించారు. తాను నోరు విప్పితే గుట్టు రట్టవుతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడిన కత్తి మహేష్.. పూనమ్ కౌర్‌కు ఆరు ప్రశ్నలు సంధించారు. అవేంటంటే...

1. మీకు ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ పదవి ఎవరి వల్ల వచ్చింది?
2. తిరుమలలో పవన్ పక్కనే నిల్చొని ఒకే గోత్రనామాలతో ఎందుకు పూజ చేయించుకున్నారు?
3. పవన్ మోసం చేశాడనే బాధతో మీరు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే మిమ్మల్ని కాపాడింది ఎవరు? మీరు ఉన్న ఆసుపత్రి ఏది? ఆ బిల్స్ కట్టింది ఎవరు?
4. పవన్ కల్యాణ్ గారు మీ అమ్మగారిని కలిసి ఏం ప్రామిస్ చేశారు? ఇప్పటివరకు అది నెరవేర్చారా? లేదా?
5. డైరెక్టర్ త్రివిక్రమ్ అంటే మీకు ఎందుకంత కోపం?
6. క్షుద్రమాంత్రికుడు నర్సిగం చేసిన పూజల్లో త్రివిక్రమ్‌, పవన్‌, మీరు ఎందుకు పాల్గొన్నారు? అక్కడ మీరు ఏం చేశారు?
ఈ ఆరు ప్రశ్నలకు పూనమ్ కౌర్ సమాధానం చెప్పిన తర్వాతే దీనిపై చర్చ పెట్టుకుందామని తాను అనుకుంటున్నట్లు కత్తి మహేష్ చెప్పారు.

Next Story