logo
సినిమా

ఆ దర్శకుడు నమ్మకద్రోహి...పూనమ్ ట్వీట్ వైరల్!

ఆ దర్శకుడు నమ్మకద్రోహి...పూనమ్ ట్వీట్ వైరల్!
X
Highlights

గ‌త కొన్ని రోజులుగా త‌న ట్విట‌ర్ ఖాతా ద్వారా సంచ‌ల‌న ట్వీట్లు చేస్తున్న హీరోయిన్ పూన‌మ్ కౌర్ తాజాగా మ‌రోసారి...

గ‌త కొన్ని రోజులుగా త‌న ట్విట‌ర్ ఖాతా ద్వారా సంచ‌ల‌న ట్వీట్లు చేస్తున్న హీరోయిన్ పూన‌మ్ కౌర్ తాజాగా మ‌రోసారి త‌న ట్వీట్ల ప‌వ‌ర్ చూపించింది. తాజాగా చేసిన ట్వీట్స్ .. ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారాయి. 'జల్సాలు చూపిస్తూ అజ్ఞాతవాసంలో వేసేస్తాడు జాగ్రత్త .. నమ్మకద్రోహి' అంటూ ఆమె చేసిన ట్వీట్ గురించే అంతా చర్చించుకుంటున్నారు. ఆమె చేసిన ఈ ట్వీట్ లో రెండు సినిమా పేర్లను వాడటంతో ఈ విషయం మరింత వేడెక్కింది.

ఓ ద‌ర్శ‌కుడిని ప‌రోక్షంగా టార్గెట్ చేస్తూ ఆమె చేసిన వ‌రుస ట్వీట్లు సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఆ ద‌ర్శ‌కుడి పేరును బ‌య‌ట‌పెట్ట‌పోయిన‌ప్ప‌టికీ ఆయ‌న చేసిన సినిమా పేర్ల‌ను ప్ర‌స్తావించ‌డం విశేషం.`ఆ ద‌ర్శ‌కుడు.. త‌ను మ‌ద్ద‌తుగా నిలిచే నాలుగు కుటుంబాల ద్వారా ఓ ఎన్నారై హీరోయిన్‌కు అవ‌కాశాలు వ‌చ్చేలా చూస్తుంటాడు. నాకు హిట్‌లు లేవు. మ‌రి, ఆమెకు హిట్‌లు ఉన్నాయా? ఎన్నారై హీరోయిన్లు మీరు చెప్పిన ప‌నులు బాగా చేస్తార‌ని విన్నాను. జ‌ల్సాలు చూపిస్తూ.. అజ్ఞాత‌వాసంలో వేసెస్తాడు జాగ్ర‌త్త‌.. న‌మ్మ‌క‌ద్రోహి. మంచికి విలువ ఇస్తే.. చెడు జ‌రిగేది కాదు. గాడ్ బ్ల‌స్ యూ ఆల్‌` అంటూ వ‌రుస ట్వీట్ల‌తో పూన‌మ్ కౌర్ హోరెత్తించింది.

Next Story