Top
logo

ప‌వ‌న్ కోసం పూనం తిట్ల‌దండ‌కం

ప‌వ‌న్ కోసం పూనం తిట్ల‌దండ‌కం
X
Highlights

నిన్న‌టి వ‌ర‌కు క్రిటిక్ క‌త్తిమ‌హేష్ పై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తూ వ‌చ్చారు. అయితే ఇప్పుడు...

నిన్న‌టి వ‌ర‌కు క్రిటిక్ క‌త్తిమ‌హేష్ పై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తూ వ‌చ్చారు. అయితే ఇప్పుడు మ‌హేష్ తీరుపై ఎండ‌గ‌డుతు ఇండ‌స్ట్రీ నుంచి విమ‌ర్శ‌లు ఎద‌రువుతున్నాయి. రైట‌ర్ కోన వెంక‌ట్..క‌త్తిమ‌హేష్ ను ఉద్దేశిస్తూ ప‌రోక్షంగా అత‌నో జోక‌ర్ అంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్విట్ పై స్పందించిన క్రిటిక్ ఘాటుగానే రిప్లైయి ఇచ్చాడు. తాజాగా ప‌వ‌న్ వీరాభిమాని అయిన హీరోయిన్ పూనం కౌర్ సద‌రు క్రిటిక్ ను ఉద్దేశించి తిట్ల‌దండ‌కం అందుకోవం విశేషం.

త‌న‌కు విమ‌ర్శ‌లు చేస్తూ డ‌బ్బులు సంపాదించే వాళ్ల‌కంటే బిచ్చ‌గాళ్లే న‌యమ‌న్న పూనం.. ఫ్యాట్సో అని నామ‌క‌ర‌ణం చేసింది. అంటే లావుగా ఉండే వాళ్ళు అని అర్థం. అంతే కాదు రోజు టీవీలో చూడలేక విసుగొస్తుంది. అత‌నికి ఉపాది క‌ల్పించ‌మంటూ పంచ్ వేసింది. ఇక బ‌రువు తగ్గ‌డానికి అందరు చందాలు వేసుకుంటే బాగుంటుంద‌ని సూచింది. అత‌న్ని ప‌ట్టించుకోండని ముఖ్య‌మంత్రిని కోరింది. ఇదంతా ఇష్టం లేకున్నా అత‌ని ఉద్దేశం ఏంటో తెలుసుకోవాల‌ని పవన్ మీద తన అభిమానాన్ని ఈ రూపంలో చాటుకుంది.

Next Story