Top
logo

కేసీఆర్‌ ఫామ్ హౌస్‌లో దాక్కున్నారు: మాజీ ఎంపీ

కేసీఆర్‌ ఫామ్ హౌస్‌లో దాక్కున్నారు: మాజీ ఎంపీ
X
Highlights

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగితే సీఎం కేసీఆర్‌ ఫామ్ హౌస్‌లో దాక్కున్నారని మాజీ ఎంపీ పొన్నం...

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగితే సీఎం కేసీఆర్‌ ఫామ్ హౌస్‌లో దాక్కున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. బయ్యారం ఉక్కు, ఎయిమ్స్ వంటివి సాధించడంలో ప్రభుత్వం విఫలమైదన్నారు. ఎయిమ్స్, బయ్యారం ఉక్కు వంటి వాటిని సాధించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. బడ్జెట్ పై జరిగిన అన్యాయంపై ఏపీ ప్రభుత్వం పోరాటానికి సిద్ధమవుతుంటే కేసీఆర్ మాత్రం బీజేపీతో కుమ్మక్కై రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు ఇంత అన్యాయం జరిగినా బీజేపీ నేతలు ఎవరూ నోరు మెదపడం లేదని మండిపడ్డారు. ఇక్కడి నాయకులకు ప్రధాని మోదీ అంటే భయమని చెప్పారు.

Next Story