Top
logo

ప్రణయ్‌ను హత్య చేయించింది అతడే: పోలీసులు

ప్రణయ్‌ను హత్య చేయించింది అతడే: పోలీసులు
X
Highlights

మిర్యాలగూడలో ప్రణయ్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్యకేసు నిందితులను గోల్కొండ పోలీసులు...

మిర్యాలగూడలో ప్రణయ్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్యకేసు నిందితులను గోల్కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూతురి ప్రేమ పెళ్లి ఇష్టం లేక ప్రణయ్ ను మారుతిరావే హత్య చేయించాడని పోలీసులు నిర్ధారించారు. నిందితులు మారుతీరావు, తిరునగరు శ్రవణ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కత్తితో హత్య చేసిన యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హత్యకు ముందు ప్రణయ్ ఇంటి ముందు హంతకుడు స్కూటిపై రెక్కి నిర్వహించినట్లుగా గుర్తించారు పోలీసులు. హంతకుడు రెక్కి నిర్వహించిన తర్వాతే ప్రణయ్ తల్లి.. భార్యతో కలిసి హస్పిటల్ కు వెళ్లారు. అమృత తండ్రి మారుతీ రావు ఎప్పటికప్పుడు హంతకుడికి ఫోన్ లో సమాచారం అందించినట్లుగా పోలీసులు గుర్తించారు.

ప్రణయ్ హత్యకు నిరసనగా మిర్యాలగూడలో నిరనసలు మిన్నంటాయి. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. హత్యకు కుట్ర పన్నిన మారుతీరావు ఆస్తులను జప్తు చేసి బాధిత కుటుంబానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బాస్కర్ రావు పలువురు ప్రజా సంఘాల నేతలు ప్రణయ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఐదో నెల గర్భంతో ఉన్న అమృత ప్రస్తుతం ఐసీయూలో ఉంది. ఆమె ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. మరో వైపు మారుతిరావు ఇంటి వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

Image removed.

Next Story