‘సర్దార్’ విగ్రహావిష్కరణ చేసిన ప్రధాని మోదీ

భారత తొలి ఉప ప్రధాని, హోంమంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్మారకార్థం ఏర్పాటు చేసిన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’...
భారత తొలి ఉప ప్రధాని, హోంమంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్మారకార్థం ఏర్పాటు చేసిన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. సర్దార్ పటేల్ 143వ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సర్దార్ పటేల్ కు మోదీ నివాళులు అర్పించారు. దాదాపు 30 నదుల నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో పటేల్ విగ్రహానికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో 37 మంది పటేల్ కుటుంబీకులు పాల్గొన్నారు. పటేల్ జయంతి, విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అన్ని జిల్లాల్లో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం చేపట్టారు. మరోవైపు ఈ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానిక నర్మదా జిల్లాలోని గిరిజనులు ఆందోళన చేపట్టారు.
భారత తొలి హోంమంత్రి సర్దార్ పటేల్ చొరవ చూపకుంటే గుజరాత్ లోని గిర్ సింహాలను చూడటానికి, సోమనాథ్ ఆలయాన్ని, హైదరాబాద్ లోని చార్మినార్ ను సందర్శించడానికి కూడా భారతీయులు వీసా తీసుకోవాల్సి వచ్చేదని ప్రధాని మోదీ అన్నారు. పటేల్ దూరదృష్టి, తెలివితేటల కారణంగానే దేశంలో 562 స్వదేశీ సంస్థానాలను విలీనం చేయగలిగారని తెలిపారు.
సర్దార్ పటేల్ పని చేయకుంటే సివిల్ సర్వీస్ లో సంస్కరణలు ఉండేవి కాదనీ, కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సరిగ్గా రైల్వే లైన్ కూడా ఉండేది కాదని మోడి అన్నారు. పటేల్ విగ్రహావిష్కరణ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియన్ సివిల్ సర్వీస్ లో స్వాతంత్ర్యం తర్వాత తొలి హోంమంత్రి పటేల్ సంస్కరణలు చేపట్టారని వెల్లడించారు. దేశవిభజన తర్వాత అస్తవ్యస్తంగా ఉన్న పోలీస్, ఇతర కేంద్ర సర్వీసులను పటేల్ గాడిలో పెట్టారన్నారు. అంతేకాకుండా పంచాయితీ ఎన్నికల్లో మహిళలు పోటీచేసేలా పటేల్ చొరవ తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
V Hanumantha Rao: ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తా..
13 Aug 2022 9:25 AM GMTహైదరాబాద్‌లో గ్రాండ్‌గా తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్-2022
13 Aug 2022 8:17 AM GMTKomatireddy Venkat Reddy: అద్దంకి దయాకర్‌ను ఎందుకు సస్పెండ్ చెయ్యలేదు..?
12 Aug 2022 9:55 AM GMTTS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMT
మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్...
14 Aug 2022 4:00 PM GMTహైదరాబాద్ కోఠి SBI ప్రధాన కార్యాలయంలో...ఆజాదీకా అమృత్ మహోత్సవ్...
14 Aug 2022 3:00 PM GMTపేద విద్యార్థులకు ఉప్పల ట్రస్టు సహకారం
14 Aug 2022 2:30 PM GMT3 వారాల విశ్రాంతి తర్వాత బయటకొచ్చిన మంత్రి కేటీఆర్
14 Aug 2022 2:00 PM GMTసోమాజిగూడలో లలితా జ్యువెలరీ ఎగ్జిబిషన్ & సేల్స్
14 Aug 2022 1:30 PM GMT