దేశంలోనే పొడవైన వంతెనను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

దేశంలోనే పొడవైన వంతెనను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
x
Highlights

ఈశాన్య రాష్ట్రాల రవాణా రంగంలో నూతన శకం ప్రారంభమైంది. దేశంలోనే అత్యంత పొడవైన పొడవైన బోగీబీల్‌ రైల్ కమ్ రోడ్‌ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోడీ జాతికి...

ఈశాన్య రాష్ట్రాల రవాణా రంగంలో నూతన శకం ప్రారంభమైంది. దేశంలోనే అత్యంత పొడవైన పొడవైన బోగీబీల్‌ రైల్ కమ్ రోడ్‌ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన ఈ 4.94 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి కింది భాగాన డబుల్ లైన్ బ్రాడ్ గేజ్‌ రైల్వే ట్రాక్ పై భాగాన మూడు లైన్ల రహదారిని నిర్మించారు. 120 సంవత్సరాల పాటు సేవలందించేలా పూర్తి స్థాయి వెల్డెడ్ స్టీల్ కాంక్రీట్ కాంపోజిట్ గర్డర్స్‌‌తో ఈ బ్రిడ్డిని నిర్మించారు. దేశంలోనే తొలిసారిగా ఇంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ బ్రిడ్జిలో 80 వేల టన్నుల స్టీల్ ప్లేట్లను వినియోగించారు. మొత్తం 5 వేల 9 వందల కోట్ల రూపాయల వ్యయంతో ఈ బ్రిడ్జిని నిర్మించారు.

1997 జనవరిలో అప్పటి ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవేగౌడ ఈ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్ధాపన చేశారు. 2002లో డబుల్ డెక్కర్ పనులను అప్పటి ప్రధాని అటల్ బీహరి వాజ్‌పేయి ప్రారంభించారు. 2014 అధికారంలోకి వచ్చిన ఎన్‌డీఏ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల్లో మౌళిక వసతుల కల్పనలో భాగంగా ఈ బ్రిడ్జి నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. పనులు పూర్తి కాకపోవడంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రధాని మోదీ నాలుగేళ్లలో పనులు పూర్తయ్యేలా కార్యాచరణ చేపట్టారు. అనుకున్నట్టు గానే నాలుగేళ్లలో పనులు పూర్తి చేసి మాజీ ప్రధాని వాజ్‌పేయి తొలి జయంతి రోజున జాతికి అంకితం చేశారు.

రైల్వే బ్రిజ్జిని ప్రారంభించిన అనంతరం ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఈ మార్గంలో ప్రయాణం చేశారు. బోగీబీల్‌ రైల్ కమ్ రోడ్‌ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో దిబ్రూఘర్ నుంచి ఇటా నగర్‌ల మధ్య తిన్షూకియా మీదుగా ప్రయాణం చేస్తే 170 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. ఇదే సమయంలో దేశ రక్షణ రంగం మరింత బలోపేతం కానుంది. గంటల వ్యవధిలోనే దళాలతో పాటు రక్షణ పరికరాలు, వాహనాలు తరలించే వీలు కలిగింది. ఈ మార్గం అందుబాటులోకి రావడంతో అసోం అరుణాచల్ ప్రదేశ్‌ల మధ్య రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories