logo
జాతీయం

16రోజుల తర్వాత స్వల్పంగా తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

16రోజుల తర్వాత స్వల్పంగా తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
X
Highlights

కర్నాటక ఎన్నికల పోలింగ్ అనంతరం వరుసగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఈ రోజు స్వల్పంగా తగ్గాయి. ...

కర్నాటక ఎన్నికల పోలింగ్ అనంతరం వరుసగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఈ రోజు స్వల్పంగా తగ్గాయి. రూపాయి బలపడడంతో పాటు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో లీటర్‌ పెట్రోల్‌‌పై 60పైసలు, డీజిల్‌ 56పైసల వరకు తగ్గింది. రాజధాని డిల్లీలో లీటరు పెట్రోల్‌ 77 రూపాయలు 83 పైసలు ఉండగా, డీజిల్‌ 68 రూపాయల 75కు చేరింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వివరాల ప్రకారం పెట్రోల్‌ ధర మంగళవారం ఆల్‌టైమ్‌ హైకి చేరింది. కర్నాటక ఎన్నికల అనంతరం లీటర్‌ పెట్రోల్‌పై 3 రూపాయల 80 పైసలు పెరగ్గా, డీజిల్‌ ధర 3 రూపాయల 38 పైసల వరకు పెరిగింది.

Next Story