వినియోగదారులకు పేటీఎం బంపర్ ఆఫర్..!

Highlights

మాములుగా అప్పు కావాలంటే ఎదో ఒకటి తాకట్టు పెట్టాల్సిందే .. కొందరికి అప్పు అంటేనే భయం .. ఇప్పుడు మనకు బ్యాంకులు అప్పులిస్తాయి.. ఇంకా క్రెడిట్ కార్డ్స్...

మాములుగా అప్పు కావాలంటే ఎదో ఒకటి తాకట్టు పెట్టాల్సిందే .. కొందరికి అప్పు అంటేనే భయం .. ఇప్పుడు మనకు బ్యాంకులు అప్పులిస్తాయి.. ఇంకా క్రెడిట్ కార్డ్స్ లాంటివి కూడా వున్నాయి .. ఇలా క్రెడిట్ కార్డు రావాలి అన్నకుడా ఇక్కడ బ్యాంకు రూల్స్ ప్రకారం అంత సాలరి లు చూపించాలి .. ఇలా దేనికైనా కూడా ప్రూఫ్ అవసరమే .. ఐతే ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని కొన్ని కంపెనీ లు అప్పులు కూడా ఇస్తున్నాయి .. ఇందులో ముఖ్యంగా .. పేటీఎం

మీరు పేటీఎం యాప్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారా? కొనుగోళ్లు కూడా అప్పుడప్పుడు చేస్తునట్లు ఐతే .. టికెట్ బుకింగ్ వంటి వాటికి పేటీఎం యాప్ ను వినియోగించటంలో మీ ట్రాక్ రికార్డ్ బాగుంటేనే ..అయితే ఇది మాత్రం మీ కోసమే .. మీరు అడిగిన వెంటనే ఎటువంటి ష్యూరిటీ లేకుండా రూ.20వేల అప్పు మీ పేటీఎం ఖాతాలో జమ అయిపోతుంది. ఇలా ఒక్క డబ్బులే కాదు.. షాపింగ్ లోనూ 20వేల విలువైన వస్తువులను కొనుగోలు చేయొచ్చు..

అంతేకాదు సినిమా టికెట్లు, ఫ్లయిట్ టికెట్లకు కూడా…. మీ పేటీఎం అకౌంట్ లో డబ్బులు లేకపోయినా అప్పు ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ సమయంలో కస్టమర్లను ఆదుకోవటం కోసం పేటీఎం కొత్త అప్పు స్కీమ్ తీసుకొచ్చింది. అందుకుగాను ఐసీఐసీఐ బ్యాంక్ తో ఒప్పందం కుదుర్చుకుంది..పేటీఎం ద్వారా.. ఐసీఐసీఐ బ్యాంక్ ఇచ్చే 20వేల అప్పుపై 40 రోజుల వరకు వడ్డీ ఉండదు. గడువులోగా తిరిగి చెల్లించకపోతే రూ.50 జరిమానాతో పాటు 3శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందట. ఈ రూ.20వేల అప్పు చెల్లించిన తర్వాత మళ్లీ కావాలంటే వెంటనే మళ్ళి తీసుకోవచ్చు..

ఈ అవకాశాన్నికస్టమర్లు ఉపయోగించుకుని లబ్దిపొందవచ్చని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ వెల్లడించారు. కేవలం ఖాతాదారులకే కాకుండా.. మిగతా వారిని కూడా ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లుగా మార్చుకునేందుకు ఈ స్కీమ్ బాగా ఉపయోగ పడుతుంది .. ప్రస్తుతం వ్యక్తిగత ఖాతాలకు మాత్రమే దీన్ని అమలు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో వ్యాపార సంస్థలకు కూడా విస్తరించనున్నట్లు అయన తెలియజేసారు..

Show Full Article
Print Article
Next Story
More Stories