‘బట్టలు విప్పి మాట్లాడుకుందాం’..సంచలన ట్వీట్స్‌తో బెంబేలెత్తిస్తున్న పవన్

టాలీవుడ్‌లో ట్వీట్‌ల సెగను మరోసారి రాజేశారు జనసేనాని. శ్రీరెడ్డి, రాంగోపాల్ వర్మ వివాదంలో తనను లాగడం వెనక...
టాలీవుడ్‌లో ట్వీట్‌ల సెగను మరోసారి రాజేశారు జనసేనాని. శ్రీరెడ్డి, రాంగోపాల్ వర్మ వివాదంలో తనను లాగడం వెనక పెద్ద కుట్ర ఉందని ఆరోపించిన పవన్ .. దీనికి సంబంధించి పలు ట్వీట్‌లు చేశారు. ఇది అనుకోకుండా జరిగిన వ్యవహారం కాదని పక్కా ప్లాన్ ద్వారా ముందే రచించిన స్క్రిప్ట్ ప్రకారం జరిగిన వ్యవహారమంటూ ట్వీట్ చేశారు. మొత్తం ఎపిసోడ్‌లో కనబడుతున్న పాత్రధారుల కంటే వెనకున్న బడాబాబులే కీలకపాత్ర పోషించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస ట్వీట్లతో పవన్ కల్యాణ్ బెంబేలెత్తిస్తున్నారు. ఇప్పటి వరకూ పవన్ ఏ విషయంపైనా స్పందించడం లేదని బాధ పడుతున్న ఫ్యాన్స్‌కు తన ట్వీట్స్‌తో ఉత్సాహం నింపుతున్నారు. ఒక ట్వీట్‌లో బట్టలు విప్పి మాట్లాడుకుందాం అన్న పవన్ మరో ట్వీట్‌లో ఒక మంత్రి, ముఖ్యమంత్రి, ఒకరు ఎవరు? తెలుసుకోవాలని ఉందా? అంటూ సంచలన ట్వీట్ చేశారు. పవన్ వరుస ట్వీట్స్.. ఆయన మాటల్లోనే...
‘‘స్టే ట్యూన్డ్ టు ‘బట్టలు విప్పి మాట్లాడుకుందాం’ ప్రోగ్రాం నుంచి పవన్ కల్యాణ్ విత్ కెమెరామెన్ ట్విటర్. ఒక రాష్ట్ర కేబినెట్ ర్యాంక్ మంత్రి స్వయానా ఈ ‘అజ్ఞ్యాతవాసి’ని వాడో బ్లాక్ మెయిలర్ అని స్వయానా ముఖ్యమంత్రి గారు అన్నారని ‘ఒకరి’తో అన్నారు. ఆ మంత్రి ఎవరు, ఆ ముఖ్యమంత్రి ఎవరు, ‘ఒకరు’ ఎవరు.. తెలుసుకోవాలని ఉందా!! స్టే ట్యూన్డ్! లైవ్ ఫ్రం హైదరాబాద్! ‘నిజాల నిగ్గు తేలుద్దాం’ ప్రోగ్రాం నుంచి మీ పవన్ కల్యాణ్. నాకు ఇష్టమైన స్లోగన్ ‘‘ఫ్యాక్షనిస్టుల ఆస్తులను జాతీయం చెయ్యాలి’’ అసలు ఈ స్లోగన్ వెనుక కథకి ఈ స్లోగన్‌కి సంబంధం ఏంటి? నిజమైన ‘అజ్ఞ్యాతవాసి’ ఎవరో మీకు తెలుసా?’’ అంటూ వరుస ట్వీట్స్ చేశారు పవన్ కల్యాణ్.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT