logo
సినిమా

వ్య‌క్తిత్వంలో నిన్ను ఓడించ‌లేని వాళ్లే వాటి గురించి మాట్లాడ‌తారు: ప‌వ‌న్ క‌ల్యాణ్

వ్య‌క్తిత్వంలో నిన్ను ఓడించ‌లేని వాళ్లే వాటి గురించి మాట్లాడ‌తారు: ప‌వ‌న్ క‌ల్యాణ్
X
Highlights

సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అభిమానులు, ప్రముఖ సినీ విమర్శకుడు, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ కత్తి...

సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అభిమానులు, ప్రముఖ సినీ విమర్శకుడు, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ కత్తి మహేశ్‌ మధ్య ఎడతెగని వివాదం కొనసాగుతూనే ఉంది. కత్తి మహేశ్‌ పవన్‌ కల్యాణ్‌ రాజకీయ విధానాలపై విమర్శలు చేయడం.. దానికి బదులుగా పవన్‌ అభిమానులు కత్తిని వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తూ దుర్భాషలాడటం కొనసాగుతూనే ఉంది. ఇటీవ‌లి కాలంలో రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించాక ఆయన‌కి తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు ఎదురవుతున్నాయి. క‌త్తి మ‌హేష్‌, రామ్‌గోపాల్ వ‌ర్మ, రోజా వంటి వారు ప‌వ‌న్‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తుంటారు. వాటికి ప‌వ‌న్ ఎప్పుడూ స్పందించిన దాఖాలాలు లేవు. ఈ వివాదం ఇలా ఉండగానే తాజాగా పవన్‌ కల్యాణ్‌ చేసిన ఓ ట్వీట్‌ ఆసక్తి రేపుతోంది.

వ్యక్తిత్వంలో నిన్ను ఓడించడం చేతకాని వాళ్లు..నీ కులం, ధనం, వర్ణం గురించి మాట్లాడతారు. (ఎవరు చెప్పారో తెలియదు కానీ ఓ సీనియర్‌ జర్నలిస్టు ఉదయాన్నే నాకు పంపించారు. బాగుందని షేర్‌ చేస్తున్నా’ అని పవన్‌ పేర్కొన్నారు. పరోక్షంగా కత్తి మహేశ్‌ను ఉద్దేశించి పవన్‌ కల్యాణ్‌ ఈ ట్వీట్‌ చేసినట్టు భావిస్తున్నారు. దీనిని సోషల్‌ మీడియాలో ర్వీట్‌ చేసిన పలువురు నెటిజన్లు సైతం ఇది కత్తి మహేశ్‌కు పవన్‌ ఇచ్చిన కౌంటర్‌ అని కామెంట్‌ పెట్టారు.

Next Story