అజ్ఞాతవాసి తో ఇరకాటంలో పడ్డ పవన్ కల్యాణ్

ఇమేజ్ పరంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వచ్చిన ఢోకా ఏం లేదు. కానీ వరుసగా రెండు ఫ్లాప్ లు రావడంతో..పవన్ కెరీర్...
ఇమేజ్ పరంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వచ్చిన ఢోకా ఏం లేదు. కానీ వరుసగా రెండు ఫ్లాప్ లు రావడంతో..పవన్ కెరీర్ కాస్త ఇరకాటంలో పడింది. నెక్ట్స్ సినిమాతో గ్యారెంటీగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పవన్ హిట్ ఇచ్చే బాధ్యతను త్రివిక్రమ్ చేతిలో పెట్టాడు. ఇప్పటికే రెండు సార్టు పవన్ ను ఆదుకున్న త్రివిక్రమ్..అజ్ఞాతవాసితో హ్యాట్రిక్ హిట్ ఖాతాలో వేసుకోవాలని తహతహలాడుతున్నాడు.
గబ్బర్ సింగ్, కాటమరాయుడు ఫ్లాప్ లతో పవన్ స్పీడ్ కు బ్రేక్ పడింది. వరుసగా రెండు హిట్లు కొట్టి నెంబర్ వన్ ప్లేస్ పై ఖర్చీఫ్ వేద్దామనుకున్న పవన్ ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో దూకుడుకు కల్లేం పడడంతో పాటు, కెరీర్ మళ్లీ ఇరకాటం లో పడింది. దీంతో ఫ్లాప్ నుంచి గట్టెక్కాలంటే త్రివిక్రమే కరెక్ట్ అనుకున్నాడు పవన్. మరోమారు ఆలోచించకుండా త్రివిక్రమ్ తో అజ్ఞాతవాసి మూవీని పట్టాలెక్కించాడు.
అజ్ఞాతవాసి సినిమాపై పవన్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. కెరీర్ సక్సెస్ ఫుల్ రన్ కావాలన్నా, ఫ్యాన్స్ లో జోష్ పెంచాలన్నా ఈ సినిమానే కీలకం. అందుకే ఆ బాధ్యతలన్నీ త్రివిక్రమ్ కు అప్పజెప్పాడు. గతంలో లాగా హిట్ ఇచ్చి ఆదుకుంటాడు అనే నమ్మకం పెట్టుకున్నాడు. ఇటు త్రివిక్రమ్ కూడా అజ్ఞాతవాసి మూవీని చాలా ప్రేస్టిజియస్ గా తీసుకున్నాడు. పవన్ కు మంచి విజయాన్ని అందించి కెరీర్ కు ఊపునివ్వాలని చూస్తున్నాడు.
త్రివిక్రమ్ తో పవన్ చేసింది రెండు సినిమాలే అయినా, అవి కెరీర్ చాలా ఉపయోగపడ్డాయి. రెండు సినిమాలు పవన్ ను కష్టాల నుంచి గట్టెక్కించినవే. జల్సా సినిమా టైంలో పవన్ కు బ్యాడ్ టైం నడిచింది. అప్పటికే నాలుగు ఐదు సినిమాల వరుస ఫ్లాప్ లతో పవన్ సతమతమవుతున్నాడు. ఆ టైంలో త్రివిక్రమ్ తో చేసిన జల్సా సినిమానే ప్లస్ పాయింట్ గా నిలిచింది. బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా, పవన్ కెరీర్ ను నిలబెట్టింది.
జల్సా తర్వాత ఇద్దరు కాంబోలో వచ్చిన మరో సినిమా అత్తారింటికి దారేది. గబ్బర్ సింగ్ సినిమాతో అప్పుడే ఫ్లాప్ నుంచి బయటపడ్డ పవన్ కు,,అత్తారింటికి దారేది మూవీ తో బూస్ట్ ఇచ్చినట్టైంది. టాలీవుడ్ రికార్డులను తిరగరాసిన ఈ సినిమాతో, పవన్ ఇమేజ్ మళ్లీ అమాంతం పెరిగిపోయింది. నెంబర్ వన్ రేస్ లో నిలిచేలా చేసింది. ఇలా రెండు సినిమాలు పవన్ ను ఆదుకున్నవే. దీంతో అజ్ఞాతవాసి పవర్ స్టార్ ఎలాంటి రిజల్ట్ ను ఇస్తాయోననే క్యూరియాసిటి మొదలైంది. పవన్ ను ఫ్లాప్ నుంచి గట్టెక్కిస్తుందా లేదా అనే సస్పెన్స్ నెలకొంది.
హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. కేసీఆర్ ఫ్లెక్సీలపై మోడీ ఫ్లెక్సీలు!
2 July 2022 1:30 PM GMTటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ..
2 July 2022 12:57 PM GMTమోడీకి అనేక ప్రశ్నలు సంధించిన కేసీఆర్.. రేపటి బహిరంగ సభలో జవాబులివ్వాలని సవాల్..
2 July 2022 12:30 PM GMTమోడీ భాగ్యలక్ష్మిని దర్శించుకుంటారా?
2 July 2022 11:48 AM GMTTalasani Srinivas Yadav: బీజేపీ సిద్ధమైతే.. అందుకు మేమూ రెడీ..
2 July 2022 11:15 AM GMTవయనాడ్ ఆఫీసు ధ్వంసాన్ని లైట్ తీసుకున్న రాహుల్
1 July 2022 12:30 PM GMT'ఆవో-దేఖో-సీకో'.. ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ
1 July 2022 12:15 PM GMT
Kishan Reddy: ఓవైసీ డ్రైవింగ్ చేస్తుంటే కేసీఆర్ పాలన సాగుతుంది
3 July 2022 11:45 AM GMTబీజేపీ సభ కోసం పరేడ్ గ్రౌండ్‌కు వచ్చిన గద్దర్..
3 July 2022 11:26 AM GMTBandi Sanjay: ఒక్క కుటుంబం చేతుల్లో తెలంగాణ నలిగిపోతోంది
3 July 2022 11:00 AM GMTPiyush Goyal: కాళేశ్వరం ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి
3 July 2022 10:49 AM GMTTelangana: ఖరీఫ్ సీజన్లో పత్తి, మిర్చి సాగుపై రైతుల ఆసక్తి
3 July 2022 10:45 AM GMT