logo

నేడు పవన్‌కల్యాణ్‌ పర్యటన వివరాలు

నేడు పవన్‌కల్యాణ్‌ పర్యటన వివరాలు
Highlights

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈరోజు కరీంనగర్‌‌లో కార్యకర్తలతో భేటీకానున్నారు. ఉ. 11 కరీంనగర్‌ శుభం...

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈరోజు కరీంనగర్‌‌లో కార్యకర్తలతో భేటీకానున్నారు. ఉ. 11 కరీంనగర్‌ శుభం గార్డెన్స్‌లో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల కార్యకర్తలతో సమావేశంకానున్న పవన్‌.... పార్టీ విధివిధానాలు, సిద్ధాంతాలపై చర్చిస్తారు. అలాగే సమస్యలను గుర్తించడానికి అధ్యయనం చేయడానికి ఏమేం చేయాలో దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మీటింగ్‌ తర్వాత సాయంత్రం కొత్తగూడెం వెళ్లనున్న జనసేనాని.... రాత్రికి కొత్తగూడెంలోనే బస చేయనున్నారు. ఇక రేపు కొత్తగూడెం నుంచి ఖమ్మం వరకు ర్యాలీ చేయనున్న పవన్‌.... ఖమ్మం ఎంబీ గార్డెన్స్‌లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఆ తరువాత హైదరాబాద్‌కు బయలుదేరతారు. పవన్ పర్యటనకు జనసేన కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేశారు.



లైవ్ టీవి


Share it
Top