logo
సినిమా

పవన్ కళ్యాణ్ నిజంగానే అజ్ఞావాసిగా మారిపోయాడు..

పవన్ కళ్యాణ్ నిజంగానే అజ్ఞావాసిగా మారిపోయాడు..
X
Highlights

అజ్ఞాతవాసి సినిమాతో పవన్ కళ్యాణ్ నిజంగానే అజ్ఞావాసిగా మారిపోయాడు. మోహాం చూపించడమే బంగారమైంది. ఓ వైపు రిలీజ్...

అజ్ఞాతవాసి సినిమాతో పవన్ కళ్యాణ్ నిజంగానే అజ్ఞావాసిగా మారిపోయాడు. మోహాం చూపించడమే బంగారమైంది. ఓ వైపు రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది. ఇంకా పట్టుమని పది రోజులు కూడా లేదు. ఐనా ఇంతకు ప్రమోషన్స్ మొదలెట్టలేదు. ఏమో ఓ సాంగ్ ను ప్రేక్షకుల మీదకి వదిలి చేతులు దులుపుకున్నాడు.

ఎంత స్టార్ హీరో ఐనా ప్రమోషన్స్ చేసుకోకపోతే ఒక్కోసారి సినిమాకు నష్టాలు తప్పవు. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడంలో ప్రమోషన్స్ దే కీలక పాత్ర. సినిమా యావరేజ్ ఐనా ప్రమోషన్స్ తో హిట్ గా మార్చుకోవచ్చు. ఒక్కోసారి ఫలితం బెడిసికొట్టినా..కలెక్షన్స్ తెచ్చిపెట్టడంలో చాలా యూస్ ఫుల్ అవుతుంది. అందుకే పబ్లిసిటీ కోసం అనేకరకాల స్టంట్లు చేస్తుంటారు. స్టార్ ఇమేజ్ ఉంది కాదా అని ప్రమోషన్స్ చేయకుండా లైట్ తీసుకున్న హీరోలకి చాలా సార్లు అనుభవం తప్పలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే దారిలో వెళుతున్నాడనే అనుమానం కలుగుతోంది.

సంక్రాంతి బరిలో నిలుస్తున్న పవన్ కళ్యాణ‌్ అజ్ఞాతవాసి జనవరి 10న రిలీజ్ కాబోతోంది. అంటే ఇంకా ఎనిమిది రోజులే టైం ఉంది. సినిమా రిలీజ్ కు సమయం దగ్గరపడుతున్నా పవన్ మాత్రం ఎలాంటి ప్రమోషన్స్ చేయడంలేదు. అజ్ఞాతవాసి మూవీకి పవన్ నిజంగా అజ్ఞాతవాసిగానే మారిపోయాడు. ఏదో సినిమాకు ప్రమోషన్ గా కొడకా కోటేశ్వర రావ్ అనే సాంగ్ ను వదిలి చేతులు దులుపుకున్నాడు.

అజ్ఞాతవాసి ప్రమోషన్స్ కోసం ఓ వైపు అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పవన్ మాట్లాడితే వినాలని..అజ్ఞాతవాసి మూవీ విశేషాలతో పాటు నెక్ట్స్ ఫ్యూచర్ ప్లాన్ తెలుసుకోవాని చూస్తున్నారు. కానీ ఈ అజ్ఞాతవాసి ఏమో బయటికి రావడం లేదు. తనకేం పట్టనట్టుగా ఉంటున్నాడు. బహుశా ఇమేజ్ తోనే సినిమా ఆడుతుందనే నమ్మకం కావచ్చు.

పవన్ కళ్యాణ్ ఇమేజ్ తోనే సినిమా ఆడుతుందనుకున్నా..అది అన్ని సార్లు వర్కౌట్ కాకపోవచ్చు. ఇలానే లైట్ తీసుకున్న కొంతమంది టాలీవుడ్ హీరోలకు నిరాశ తప్పలేదు. పైగా పవన్ కళ్యాణ్ సింగిల్ వస్తే ప్రమోషన్స్ కు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకోవచ్చు. కానీ సంక్రాంతి సీజన్ కాబట్టి పవన్ తో పాటు బాలయ్య, సూర్య బరిలోకి తిగుతున్నారు. ఇలాంటి సమయంలో వారికి పోటీగా నిలవాలంటే ప్రమోషన్స్ చేయకతప్పుదు. మరి పవన్ ఇకనైనా మెల్లగా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తాడా లేక అజ్ఞాతవాసిగా మారతాడా అనేది చూడాలి.

Next Story