logo
సినిమా

అయోమయంలో పవర్ స్టార్ ఫ్యాన్స్

అయోమయంలో పవర్ స్టార్ ఫ్యాన్స్
X
Highlights

రజినీ కాంత్ లానే అంత పిచ్చిగా హీరోని ఫాలో అయ్యే ఫ్యాన్స్ ఉన్న ఏకైక తెలుగు స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...

రజినీ కాంత్ లానే అంత పిచ్చిగా హీరోని ఫాలో అయ్యే ఫ్యాన్స్ ఉన్న ఏకైక తెలుగు స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాంటి తను అజ్ఙాతవాసి తర్వాత నిజంగానే సినిమాలకు అజ్ఞాతవాసిలా మారేలా ఉన్నాడు.
ప్యాంట్ మీద ప్యాంటేసినా చిత్రవిచిత్రమైన హేయిర్ కట్ తో కనిపించినా, షర్ట్ మీద షర్ట్ వేసినా, తనేం చేస్తే అదే చేసే అభిమానులు, పవన్ సొంతం వేరే హీరోల ఆడియో ఫంక్షన్ లో కూడా పవనిజం మోతమోగుతుంది అలాంటి అబిమాన సునామీ పవన్ సొంతం.

పవన్ కళ్యాణ్ కాటమరాయుడు టాక్ వీకైనా,97 కోట్లొచ్చాయి సర్ధార్ గబ్బర్ సింగ్ ఫ్లాపైనా నిర్మాతకి పెట్టుబడొచ్చింది అంతెందుకు అప్పట్లో అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ కిముందే లీకైంది అయినా, నిర్మాత నష్టపోలేదు ఫ్యాన్స్ ఊరుకోలేదు ఫలింత 130 కోట్ల పైనే గ్రాస్ కలెక్షన్లు దటీస్ పవర్ స్టార్. పవర్ స్టార్ 21 ఏళ్లలో చేసింది 25 సినిమాలే పెద్ద గా ఇంటర్వూలుండవు మాటలతో గారడి చేయడు అసలు తనదోలోకం అన్నట్టుంటాడు అయినా అభిమానులకు తనే ఓ మైకం. తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, చెన్నై, కోల్ కతా, ఓరిస్సా తోపాటు దేశ విదేశాల్లో ఇలా అంతటా తన అభిమానులే అందుకే తను సినిమాలొదిలేస్తే, ఫ్యాన్స్ తట్టుకునే పరిస్థితుండదు మరి నిజంగానే పవన్ సినిమాలొదిలేస్తాడా?

తొలిప్రేమ నుంచి ఇప్పటికీ ఇంకా యూత్ లో కోట్లాదిమంది ఫ్యాన్స్ పవన్ సొంతం అందుకే పవనిజం పేరుతో ఎన్నోపాటలొచ్చాయి ఆల్బమ్ లొచ్చాయి అంతెందుకు హీరో నితినే పవర్ ని వీరాభిమాని దొక్కటి చాలు, తోటి హీరోల్లోనే ఈ హీరోకున్న క్రేజ్ ఏంటో చెప్పడానికి. చిరు తమ్ముడే అయినా, పవన్ అన్ననే మించిపోయాడు. అప్పట్లో తను గుడుంబా శంకర్ లో ప్యాంట్ మీద ప్యాంట్ వేస్తే ఫ్యాన్స్ అలానే వేశారు బాలులో విచిత్రమైన ప్యాంట్ వేస్తే, అప్పట్లో అలాంటి ప్యాంటులే సేల్ అయ్యాయి...ఇలా పవన్ ఏది చేస్తే అదే చేసేలా ఫ్యాన్ ఫాలోయింగ్ పవర్ స్టార్ సొంతం. అలా చూస్తే తమిళ సూపర్ స్టార్ రజినీకి, పవన్ తెలుగు వర్షన్ లా కనిపిస్తాడు. రజనీ కాంత్ లానే పవన్ కూడా సినిమాలు వదిలేసేలా ఉన్నాడు.

రజినీ కాంత్ లానే సింప్లిసిటీ, ఎదిగినా ఒదిగి ఉండటం, తన సినిమాలు కొని నష్టపోయిన బయ్యర్లకు, డబ్బులు తిరిగివ్వటం ఇలాంటి లక్షణాలే పవన్ కళ్యాణ్ కి కోట్లాది మంది అభిమానుల్ని సొంతమయ్యేలా చేశాయి. అందుకే రజినీ కాంత్ పవన్ కి తెలుగు వర్షన్ అనే పోలికలొచ్చాయి ఏదేమైనా, ఇంత క్రేజ్ ఉన్న స్టార్, సినిమాలొదిలేస్తాడనిక కాసేలు, పాలిటిక్స్ లో బిజీ ఉన్నా, మళ్లీ మూవీలు చేస్తాడని ఇంకాసేపు ఇలా రకరకాల ఊహాగానాలు అభిమానుల్ని గందరగోలానికి గురిచేస్తున్నాయి.

పవన్ కళ్యాన్ కూడా రిజనీలానే సినిమాలకు గుడ్ బై చెప్పలే కనిపిస్తున్నాడు. అంటే అజ్ఞాతవాసి తర్వాత ఇక సినిమాలు చేయడా? ఇప్పటి వరకైతే మరో మూవీకి కమిట్ కాలేదు అలా చూస్తే పాలిటిక్స్ కోసం తను సినిమాలొదిలేస్తున్నట్టే కనిపిస్తోంది. రజినీ కాంత్ లానే తనుకూడా నిర్ణయం తీసుకున్నాడనే మాటే వినిపిస్తోంది. 2019 అంటేనే సౌత్ లో రెగ్యులర్ పాలిటిక్స్ ని స్టార్ హీరోలే డామినేట్ చేసేలా ఉన్నారు. అటు తమిళనాడులో సూపర్ స్టార్ రజీనీ కాంత్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ వచ్చే ఏడాది ఎలక్షన్స్ కి రెడీ అంటున్నారు ఫ్యాన్స్ ని ఆందోళనలోకి నెట్టారు.

మెగాస్టార్ చిరంజీవి కూడా రాజకీయాల్లోకి వచ్చేప్పుడు సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి, పూర్తిగా రాజకీయాలకే అంకితమయ్యాడు..కాకపోతే, పార్టీ నడపలేకపోవటం, తానొవ్వక నొప్పించక సేఫ్ గేమ్ ఆడటంతో, అసలు పాలిటిక్స్ కే పనికిరాడన్న అపవాదొచ్చింది రజినీకాంత్ కూడా ఎగ్రసీవ్ గా ఉండేవ్యక్తి కాదు కాబట్టి, తను కూడా అలానే తయారయ్యే ఛాన్స్ ఉందనే కామెంట్ ఉంది.

పవన్ కళ్యాన్ సినిమాలు చేస్తూనే, అప్పడప్పుడు సభలు పెడుతున్నాడు సమస్యలమీద పోరాటం చేస్తున్నాడు జనం కూడా కోకొల్లగా వస్తున్నారు కాని జనం సభలకు వచ్చినా, అదే జనం ఓట్లేస్తారనే గ్యారెంటీ లేదు. చిరంజీవికి అప్పట్లో అదే జరిగింది అందుకే అటు రజినీకాంత్ కి, ఇటు పవన్ కి అలానే జరిగే ఛాన్స్ కూడా ఉంది.

పవన్ అభిమానులకు ఎమోషన్స్ తప్ప లాజిక్స్ ఉండవంటారు కాని పాలిటిక్స్ కి లాజిక్కే ముఖ్యం నో ఎమెషన్స్ అందుకే పవన్ మీదున్న అభిమానం ఓట్లుగా మారుతాయన్నది పెద్ద డౌట్ అలాచూస్తే పవన్, రజినీ కాంత్, నెక్ట్స్ ఎలక్షన్స్ లో ఫేయిలైతే, చిరు లానే యూటర్న్ తీసుకోవాల్సి వస్తుందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. నెక్ట్స్ ఎలక్షన్ లో పవన్, రజినీ కాంత్ సక్సెస్ కాకపోతే, ఎలక్షన్లైన రెండేళ్లకి ఇద్దరూ, తిరిగి సినమాల్లోకే వస్తారనే లెక్కలు కూడా , కామెంట్ల రూపంలో వినిపిస్తున్నాయి.

Next Story