Top
logo

ఫిలించాంబర్‌లో పవన్.. అందరిలో ఉత్కంఠ.. ఏం జరగబోతోంది?

ఫిలించాంబర్‌లో పవన్.. అందరిలో ఉత్కంఠ.. ఏం జరగబోతోంది?
X
Highlights

శ్రీరెడ్డి-వర్మపై న్యాయ పోరాటానికి జనసేనాని సిద్ధమవుతున్నారు. బ్లాక్‌ డ్రెస్‌లో ఫిల్మ్‌ ఛాంబర్‌‌‌కి వచ్చిన...

శ్రీరెడ్డి-వర్మపై న్యాయ పోరాటానికి జనసేనాని సిద్ధమవుతున్నారు. బ్లాక్‌ డ్రెస్‌లో ఫిల్మ్‌ ఛాంబర్‌‌‌కి వచ్చిన పవన్ కల్యాణ్‌.... శ్రీరెడ్డి-వర్మ అనుచిత వ్యాఖ్యలపై నిరసన తెలుపుతున్నారు. వర్మపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్న జనసేనాని... ఫిల్మ్‌ ఛాంబర్‌‌లో న్యాయవాదులతో సమావేశమయ్యారు. శ్రీరెడ్డి-వర్మ ఇష్యూలో ఏవిధంగా ముందుకెళ్లాలో చర్చిస్తున్నారు.

ఫిల్మ్‌ ఛాంబర్‌‌‌కి వచ్చిన పవన్ కల్యాణ్‌‌కి మెగా ఫ్యామిలీ సభ్యులు, ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దలు, నటీనటులు మద్దతు తెలుపుతున్నారు. పవన్‌ వెంట నాగబాబు రాగా అల్లు అర్జున్‌‌, సాయిధరమ్‌ తేజ్‌‌ కూడా పవన్‌‌కి మద్దతుగా ఫిల్మ్‌ ఛాంబర్‌కి వచ్చారు. మరోవైపు పవన్‌ పిలుపుతో పెద్దఎత్తున జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులు చేరుకుంటున్నారు.

కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్న పవన్‌ కల్యాణ్‌... ప్రెస్‌మీట్‌ ముగిశాక దీక్షకు దిగుతారనే టాక్‌ వినిపిస్తోంది. అయితే ఫిల్మ్‌ ఛాంబర్‌లోనే దీక్ష చేపడతారా? లేక మరో ప్లేస్‌‌ను ఎంచుకుంటారా? అసలు దీక్షకి దిగుతారో లేదో క్లారిటీ రావాల్సి ఉంది.

Next Story