Top
logo

ఆస్పత్రిలో పేలిన ఆక్సిజన్ సిలిండర్

ఆస్పత్రిలో పేలిన ఆక్సిజన్ సిలిండర్
X
Highlights

సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని పిల్లల వార్డులో అగ్ని ప్రమాదం జరిగింది. వార్డులో ఆక్సిజన్ సిలిండర్‌ పేలడంతో ...

సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని పిల్లల వార్డులో అగ్ని ప్రమాదం జరిగింది. వార్డులో ఆక్సిజన్ సిలిండర్‌ పేలడంతో ఒక్క సారిగా ఆసుపత్రిని పొగలు కమ్మేశాయి. దీంతో ఏం జరుగుతుందో తెలియక రోగులు పరుగులు పెట్టారు. వార్డు నుంచి బాలింతలు బయటకు రాలేక అవస్ధలు పడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అనంతరం బాలింతలు, చిన్నారులను మరో వార్డుకు తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Next Story