కేరళలో ఒకే ఇంట్లో వంద పాములు

కేరళలో వరదలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు మెల్లగా పునరావాస శిబిరాల నుంచి మళ్ళీ తమ ఇళ్ళకు చేరుకుంటున్నారు. నీటి...
కేరళలో వరదలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు మెల్లగా పునరావాస శిబిరాల నుంచి మళ్ళీ తమ ఇళ్ళకు చేరుకుంటున్నారు. నీటి ప్రవాహంతో పాడైపోయిన తమ వస్తువులు, ఇతరాలను చూసి బావురుమంటున్నారు. కొందరి ఇళ్ళలో నీటిలో కొట్టుకొచ్చిన పాములు, విష కీటకాలు ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కేరళలో వరదలు తగ్గు ముఖం పట్టాయి. గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలు కేరళకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. వరదల వల్ల ఇప్పటివరకూ దాదాపు 350మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు భారీ వర్షాలు ఇళ్లు, రోడ్లు నీళ్ల మయంగా మారాయి.
అయితే వరదలు తగ్గు ముఖం పట్టినప్పటికీ అక్కడున్న ప్రజలను మరో భయం వెంటాడుతోంది. పునరావాస శిబిరాల నుంచి సొంత ఇళ్లకు వెళుతున్న ప్రజలకు పాముల భయం పట్టుకుంది. దాదాపు గత మూడు నాలుగు రోజుల్లోనే కేరళ వ్యాప్తంగా భారీగా పాముకాటు కేసులు నమోదయ్యాయి. కేరళలోని ఎర్నాకులం, వ్యాపిన్, వడకర్ర, పరావూర్ ప్రాంతాల్లో పాముకాటు కేసులు ఎక్కువగా నమోదైనట్లు తెలిసింది. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లిన వారు ఇంటిని శుభ్రం చేస్తుండగా అప్పటికే ఇంట్లో, ఇంటి పరిసరాల్లో ఉన్న పాములు కాటేస్తున్నట్లు తేలింది. ఇదిలా ఉంటే.. కొన్ని ఇళ్లలో వరదల ధాటికి తట్టుకోలేక చనిపోయిన పాములు కూడా కనిపిస్తున్నాయి.
పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్తున్న ప్రజలు అక్కడి పరిస్థితిని చూసి షాక్ అవుతున్నారు ఇంటినిడా బురద బురద నీటిలో తడిసి పోయిన విలువైన వస్తువులు దీనికితోడు ఇంటి ప్రాంగణాల్లో విషపూ రిత పాములు, మొసళ్లు సంచరిస్తుండటాన్ని చూసి భయాం దోళనలకు గురవుతున్నారు. ఇప్పుడు ఇదే వారికి పెద్ద సమస్య గా మారుతోంది. కేరళ వరదల కారణంగా వచ్చిన పాముల బెడద అక్కడి ప్రజలను భయ పెడుతోంది సహాయ బృందాలకు కూడా పాముల సంచారం పెద్ద సమస్యగా మారుతోంది. రహదారులను శుభ్రం చేస్తున్న సందర్భంలో పాములు, ఇతర విషపూరిత కీటకాలు కనిపించడం తీవ్ర ఇబ్బందిగా మారుతోంది. మలప్పురం లోని ఓ ఇంట్లో ఏకంగా 100 పాములు దర్శనమి చ్చాయి.
పాము కాటుకు గురైన వారికి సరైన వైద్యం కూడా అందే పరిస్థితి లేదు మందులు అందుబాటులో లేకపోవడంతో వైద్యులు ఏమీ చేయలేక పోతున్నారు ఇక పాము కాటుకుగురైన వారి నుంచి మాకు అనేక ఫోన్లు వస్తున్నాయి. పాము కరిచిన సమయంలో ఏం చేయాలో ఏ చేయకూడదో సూచనలు ఇస్తున్నాం’’ అని స్నేక్‌బైట్ హీలింగ్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ సభ్యులు చెబుతున్నారు.
పాముల భయంతో అనేక మంది ఇళ్లకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఈ పరిస్థితి గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లోనూ ఉంది అయితే అనేక పాములు విషపూరితం కావని, కానీ అవి కాటువేసినప్పుడు తీవ్ర భయాందోళనలకు గురై మరణాలు సంభవిస్తున్నాయని వైద్య అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇళ్లకు వెళ్లే వరద బాధితులు అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటిలోకి వెళ్లే ముందు శబ్దం చేస్తూ వెళ్లాలని సూచన చేశారు. షూస్‌లో చేతులు పెట్టొద్దని.. జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న సీఎల్పీ బృందం
16 Aug 2022 4:06 AM GMTHar Ghar Tiranga: జాతీయ జెండాను ఎలా భద్రపరచాలి..
15 Aug 2022 11:55 AM GMTBandi Sanjay: డీజీపీకి డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్
15 Aug 2022 9:19 AM GMTతెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు
15 Aug 2022 8:15 AM GMTగోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15 Aug 2022 6:33 AM GMTచిరంజీవి బ్లడ్ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 6:17 AM GMTమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 4:49 AM GMT
సూర్యుడి ఏజ్‌ను నిర్ధారించిన యురోపియన్ స్పేస్ ఏజెన్నీ..
16 Aug 2022 4:15 PM GMTబాలీవుడ్‌పై బాయ్‌కాట్ పడగ.. టాప్ హీరోలు చేసిన తప్పేంటి?
16 Aug 2022 4:00 PM GMTకొత్త స్టార్టప్ సంస్థను అనౌన్స్ చేసిన రతన్‌టాటా.. సీనియర్ సిటిజన్స్...
16 Aug 2022 3:45 PM GMTరైతులకి పెద్ద ఉపశమనం.. వారికి 4000 రూపాయలు..!
16 Aug 2022 3:30 PM GMTAsaduddin Owaisi: ఆర్టికల్ 370 రద్దు చేసి ఏం సాధించారు? కశ్మీర్లో...
16 Aug 2022 3:15 PM GMT