Top
logo

రాహుల్‌ టూర్‌: తన్నుకున్న ఓయూ స్టూడెంట్స్‌

రాహుల్‌ టూర్‌: తన్నుకున్న ఓయూ స్టూడెంట్స్‌
X
Highlights

తెలంగాణలో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు...

తెలంగాణలో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు అనుమతి లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. హరితప్లాజాలో రాహుల్ గాంధీ భేటీ ఆగమాగమైంది. ముఖ్యనేతల జాబితాలో సీనియర్‌ నేత జానారెడ్డి పేరు లేకపోవడంతో ఆయన షబ్బీర్‌ అలీలు అలిగి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. దీంతో గూడూరు నారయణ రెడ్డి బుజ్జగించి లోపలికి పంపించారు. ఇక రేవంత్‌ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలకు సైతం చేదుఅనుభవం ఎదురైంది. సీనియర్ల మీటింగ్‌ లోపలికి వెళ్లడానికి రేవంత్‌ రెడ్డికి పాస్‌ నిరాకరించగా.. సునీతా లక్ష్మారెడ్డిని అనుమతించలేదు. దీంతో ఆమె కంట తడిపెట్టారు. ఉస్మానియా విద్యార్థుల భేటీలో సైతం గొడవ చోటుచేసుకుంది. కొందరికి అనుమతి లేదనడంతో రెండు వర్గాలుగా విడిపోయిన విద్యార్థులు హోటల్‌లోనే కొట్టుకున్నారు. ఈ గొడవతో విద్యార్థులతో రాహుల్‌ భేటీ రద్దైంది.

Next Story