ఆస్కార్‌ వేడుకలో శ్రీదేవి, శశికపూర్‌కి నివాళి

ఆస్కార్‌ వేడుకలో శ్రీదేవి, శశికపూర్‌కి నివాళి
x
Highlights

90వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. లాస్‌ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో భారత కాలమాన ప్రకారం సోమవారం ఉదయం 6.30 గంటలకు...

90వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. లాస్‌ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో భారత కాలమాన ప్రకారం సోమవారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన వేడుక సినీతారల సందోహం, సందడి మధ్య కన్నులపండువగా జరిగింది. అవార్డులు ప్రకటించే ఏడాదిలో కన్నుమూసిన సినీ ప్రముఖులకు నివాళులర్పించడం ఆస్కార్‌లో సంప్రదాయంగా వస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల కన్నుమూసిన అతిలోక సుందరి శ్రీదేవిని ఆస్కార్ వేదిక గౌరవించింది. శ్రీదేవి జ్ఞాపకార్థం ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేదికపై అమెకు నివాళులర్పించారు.

శ్రీదేవితో పాటు ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత శశి కపూర్‌కు కూడా స్మృత్యంజలి ఘటించారు. ప్రముఖ అమెరికన్‌ సంగీత దర్శకుడు ఎడ్డీ వెడ్డర్‌ స్టేజ్‌పైన సంగీత ప్రదర్శనతో వీరికి నివాళులు అర్పించారు. 2017 డిసెంబర్‌లో శశికపూర్‌ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. 2018 ఫిబ్రవరి 25న శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి కన్నుమూశారు. భారతీయ ప్రేక్షకుల కోసం.. వీరికి నివాళులు అర్పించేలా ఆస్కార్‌ ఏర్పాట్లు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories