మళ్లీ మొదటికి వచ్చిన సంగీత కథ

x
Highlights

హైదరాబాద్ బోడుప్పల్ కు చెందిన సంగీత కథ మళ్లీ మొదటికి వచ్చింది.. సంగీత భర్త శ్రీనివాసరెడ్డి మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకుని పెళ్లిచేసుకుని...

హైదరాబాద్ బోడుప్పల్ కు చెందిన సంగీత కథ మళ్లీ మొదటికి వచ్చింది.. సంగీత భర్త శ్రీనివాసరెడ్డి మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకుని పెళ్లిచేసుకుని పరారయ్యాడు. విషయం తెలుసుకున్న సంగీత న్యాయం కోసం పోలీసులను, కోర్టును ఆశ్రయించింది. అత్తారింటి ముందు రెండేళ్ల కూతురితో కలిసి 54 రోజుల పాటు న్యాయపోరాటం చేసింది. సంగీత చేసిన పోరాటంలో పెద్ద సంఖ్యలో మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు మద్దతు ఇచ్చారు. న్యాయం జరిగే వరకు సంగీతకు అండగా ఉంటామన్నారు ఏడాది గడిచింది. సంగీత ఏం కోరుకుందో ఏది డిమాండ్ చేసిందో నెరవేరలేదు.

సంగీత పిటిషన్ పై విచారణ జరిపిన ఫ్యామిలి కోర్టు భర్త శ్రీనివాస రెడ్డి ఇంట్లోనే సంగీత ఉండే విధంగా నెలకు 20 వేలు చెల్లించాలని ఆదేశించింది. అయితే 20 వేలు కాదు 20 రూపాయలు కూడా చెల్లించడం లేదని సంగీత వాపోయింది. తనకు న్యాయం చేస్తాం అండగా ఉంటామని చెప్పిన వారెవరు పట్టించుకోకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన కూతురుతో కలిసి మరోసారి న్యాయ పోరాటం చేస్తానంటోంది సంగీత

సంగీత పోరాటానికి తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందంటున్నారు సామాజిక సేవా సంస్థలు. ఎన్నికేసులు పెట్టినా సంగీతకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని చెబుతున్నారు. మహిళలపై జరుగుతున్న వేధింపులు సామాజిక బాధ్యతగా చూడాలంటున్నారు. బెయిల్ ఇచ్చే ముందు కండీషన్ బెయిల్ ఇవ్వాలని సూచిస్తున్నారు. సంగీత పోరాటంతో ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని మహిళా సంఘాలు, కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories