Top
logo

మధురమే నీ.. స్వరమే...అఫీషియల్‌ సింగర్‌లా పాడిన కామన్‌ లేడీ

X
Highlights

హావభావాలు అవే.. పాట కూడా అంతే అద్భుతంగా వచ్చింది. కానీ పాడినవారే సింగర్‌ కానే కాదు. ఓ సాధారణ మహిళ. టాలెంట్‌...

హావభావాలు అవే.. పాట కూడా అంతే అద్భుతంగా వచ్చింది. కానీ పాడినవారే సింగర్‌ కానే కాదు. ఓ సాధారణ మహిళ. టాలెంట్‌ ఎవరి సొత్తు కాదని చెబుతున్న ఓ కామన్‌ లేడీ పాడిన పాట సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ప్రేమికుడు సినిమా పాటను అద్భుతంగా ఆలపించిన ఆమె స్వరం.. ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌లల్లో మారు మోగుతోంది. చూడ్డానికి ఓ సాధారణ గృహిణిగా కనిపిస్తున్న ఈ మహిళ సినిమాల్లో పాటలు పాడే సింగర్‌కు ఏ మాత్రం తీసిపోకుండా పాట పాడుతూ అబ్బురపరుస్తోంది. ఓ గిరిజన మహిళగా కనిపిస్తున్న ఈమె ఇంత అద్భుతంగా పాడటం అనేది అందరినీ నిజంగా ఆశ్చర్యపరుస్తోంది.

గత వారం పది రోజుల నుంచి వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా యాప్స్‌లో తెగ షేర్‌ అవుతున్న ఈమె గురించి ఎవరికీ తెలియదు. అసలు ఆమెకు ఇంత అద్భుతమైన గాత్రం ఉంటుందని కూడా ఎవరూ ఊహించని కూడా ఊహించరు. అయితే ఆ వీడియోలో వినిపిస్తున్న పాట నిజానికి ఆమె పాడిందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఆమె గొంతు నుంచి జాలువారిన ఈ పాట మరోసారి ఆనాటి మధురస్మృతులను గుర్తు చేసింది.

Next Story