జనవరి నుంచి రైళ్లలో షాపింగ్‌..!

జనవరి నుంచి రైళ్లలో షాపింగ్‌..!
x
Highlights

రైళ్లల్లో ప్రయాణించే ప్రయాణికులకు తీయ్యటి వార్తా వచ్చేసింది. సాధారణంగా విమానాల్లో షాపింగ్ మాదిరిగానే ఇక నుండి ఏంచక్క రైళ్లలోనూ ప్రయాణికులు షాపింగ్...

రైళ్లల్లో ప్రయాణించే ప్రయాణికులకు తీయ్యటి వార్తా వచ్చేసింది. సాధారణంగా విమానాల్లో షాపింగ్ మాదిరిగానే ఇక నుండి ఏంచక్క రైళ్లలోనూ ప్రయాణికులు షాపింగ్ చేసుకోనే సదుపాయాన్ని రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ అవకాశం వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రయాణికులకు కావాల్సిన సౌందర్య ఉత్పత్తులు, గృహోపకరణాలు,ఇతర వస్తువుల కొనుగోలు చేసే విధంగా ఏర్పాటుకు రైల్వేశాఖ భారీ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులోనూ నిబంధనలు పెట్టారు. సదరు కాంట్రాక్టర్‌ ఎలాంటి తినుబండారాలు, సిగరెట్లు, మత్తుపానీయాలు అమ్మడానికి వీల్లుకుండా నిబంధన పెట్టారు. ఈ నిబంధనలు ఉల్లింఘించిన కఠిన చర్చలు ఉంటాయని తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే రైళ్లలో ఈ అమ్మకాలు జరపాల్సి ఉంది. ఇది దశల వారిగా ఏర్పాటుచేయనున్నారు. మొదటి దశలో రెండు రైళ్లలో ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టనున్నారు. అనంతరం దశల వారీగా ఇతర రైళ్లలోను ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories